అన్న నందమూరి తారకరామారావు జీవితం తెరచిన పుస్తకం,  ఆయన 73 ఏళ్ళు బతికారు. మూడున్నర దశాబ్దాలు సినీ రంగంలో మకుటం లేని మహారాజులా వెలిగారు. రాజకీయాల్లో సైతం పద్నాలుగేళ్ళ పాటు సక్సెస్ ఫుల్ గా  రాణించారు. మూడు మార్లు ముఖ్యమంత్రి గా పనిచేశారు. ఇవనీ రామారావు గారి జీవితంలో వెలుగులు, మరి చీకటి కోణాలు ఏంటి, చివరి దశ జీవితం ఏంటి. దాని మీద ఏపీ ప్రజలకు ఇప్పటికీ క్యూరియాసిటీ ఉంది. దాన్నే కధా వస్తువుగా తీసుకుంటే మహానటిని మించిపోయే  విషాదం అందులో ఉంటుంది. 


సరిగ్గా ఆ పాయింటునే టచ్ చేస్తూ రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ యన్‌.టీ.ఆర్‌’  మూవీని తీస్తున్నారు. లక్ష్మీస్ యన్‌.టీ.ఆర్‌’  మూవీ అన్నది  అన్న గారి జీవితంలో ఎవరూ చూడని, వినని కధ ఉంటుందని అన్నారు. ఆయన ఆఖరి దశలో పడిన మధనం, తపన, ఆయన రెండవ వివాహం ముందూ వెనక సంభవించిన పరిణామలు ఇవన్నీ కూడా గుది గుచ్చినట్లుగా చూపిస్తామని చెప్పుకొచ్చారు. యన్‌.టీ.ఆర్‌’   చివరి దశలో పల్లాలు ఎక్కువని, వాటిని ఎవరూ ఇంతవరకూ ఆలొచించలేదని కూడా వర్మ అంటున్నారు.


బాలయ్య తీస్తున్న యన్‌.టీ.ఆర్‌’  బయోపిక్ అభిమానుల కోసమని, అందులో విజయాలే ఉంటాయని కూడా రామూ అనడం విశేషం. పరాజయాల గురించి ఆయన కుమారుడు గా బాలయ్య ఎక్కడ టచ్ చేయలేడని కూడా పేర్కొన్నారు. అయితే తాను తీసేది మాత్రం నగ్న సత్యాలతో కూడిన యన్‌.టీ.ఆర్‌’  చరమాంకంలోని జీవిత కధ అని వర్మ చెప్పారు. 


ఈ కధలో లక్ష్మీ పార్వతి కేంద్ర బిందువుగా ఉండడం వల్ల ఆమె అనుమతి మాత్రమే తీసుకుని, ఆమె వద్ద నుంచి కొంత కధను సేకరించి మిగిలినది వివిధ వర్గాల సమాచారంగా తీసుకుని మరీ లక్ష్మీస్ యన్‌.టీ.ఆర్‌’  మూవీ చేస్తున్నానని వర్మ అన్నారు. ఇది నిజాయతీగా చేసే ప్రయత్నం. ఓ ఉన్నత  స్థానంలో  ఉన్న మనిషి జీవితంలో లోతులు ఎన్ని ఉన్నాయో, ఆయన ఎందాక వెళ్ళారో చెప్పడంలోనూ హీరోయిజం ఉందని వర్మ అంటున్నారు. ఈ మూవీ తనకు పూర్తి సంత్రుప్తి ఇచ్చేలా తీస్తానని కూడా అయన వెల్లడించారు.


యన్‌.టీ.ఆర్‌’  అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని, ఆ గౌరవంతోనే ఈ మూవీని తీస్తున్నానని, ఇందులో అసత్యాలు, అర్ధ సత్యాలు ఉండవంటే ఉండవని చెప్తూ వర్మ ఓ రేంజిలో హైప్ పెంచేశారు. నిజానికి బాలయ్య మహానాయకుడు ఎక్కడ ముగుస్తుందో అక్కడ నుంచి వర్మ యన్‌.టీ.ఆర్‌’ మూవీ మొదలవుతుందనుకోవాలి. ప్రేక్షకులు ఎక్కువగా నెగిటివె నే రిసీవ్ చేసుకుంటారు. 


అలా కనుక ఆలొచిస్తే వర్మ యన్‌.టీ.ఆర్‌’ బయోపిక్ లోనే అసలు మసాలా అంతా ఉందంటున్నారు. ఇక అన్న గారి జీవితం చివరలో ఎవరు ఆయన వెంట ఉన్నారో అందరూ తన చిత్రంలో కనిపిస్తారని వర్మ చెప్పడంతో ఇంటెరెస్ట్ మరింతగా పెరిగిపోతోంది. కొత్త వాళ్ళతో తీస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని కూడా వర్మ చెప్పారు. మొత్తానికి చూస్తే వర్మాస్ యన్‌.టీ.ఆర్‌’ ఓ రేజిలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: