600 కోట్ల భారీ బడ్జెట్ హాలీవుడ్ స్టాండర్డ్స్ తో వస్తున్న సినిమా 2.ఓ. రోబోకి సెకండ్ వర్షన్ గా రాబోతున్న ఈ మూవీకి శంకర్, రజిని తమ శక్తిమేర పెట్టాల్సిన శ్రమ పెట్టారు. ఈ ఇద్దరితో పాటుగా సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది.


మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ టెన్షన్ ఉండటం కామనే.. కాని అందరికన్నా తెలుగు డిస్ట్రిబ్యూటర్ అయిన ఎన్వి ప్రసాద్, దిల్ రాజులు 2.ఓ విషయంలో ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది.


అసలు నిర్మాతలకు లేని టెన్షన్ వీరికేంటి అంటే నిర్మాతలదేముంది అమ్మేసుకుని చేతులు దులుపుకుంటారు కాని డిస్ట్రిబ్యూటర్స్ అలా కాదు కదా అది కాకుండా రజిని సినిమాలు ఈమధ్య తెలుగులో అంతగా ప్రజాదరణ పొందట్లేదు. కబాలి, కాలా సినిమాల ఎఫెక్ట్ 2.ఓ మీద పడకుండా జాగ్రత్తపడుతున్నారు. 2.ఓ తెలుగు రైట్స్ ను 72 కోట్లకు కొన్నారట.


అంటే ఎలా లేదన్నా 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే తప్ప తెలుగు నిర్మాతలు సేఫ్ అవ్వరు. అంత రాబట్టాలి అంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. మరి 2.ఓ అంత రాబడుతుందా లేదా.. సినిమా రేంజ్ ఏంటన్నది గురువారం సాయంత్రం కల్లా తెలిసిపోతుంది. వరల్డ్ వైడ్ గా 6800 థియేటర్స్ లో 2.ఓ రిలీజ్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: