తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘వర్షం’చిత్రంలో ఇన్నాళ్లకు గుర్తుచ్చానా వానా అంటూ కుర్రాళ్ల మనసు దోచిన నటి త్రిష.  ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  ప్రస్తుతం తమిళనాట స్టార్ హీరోయిన్ నయనతార తర్వాత ఈ అమ్మడికే ఎక్కువ రెమ్యూనరేషన్.  ఇప్పటికీ గ్లామర్ మెయింటేన్ చేస్తు కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది.  ఈ మద్య నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలు, హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తుంది. 
Image result for trisha
హీరోయిన్ గా ఎంత క్రేజ్ ఉందో..రియల్ లైఫ్ లో అన్ని వివాదాలు ఉన్నాయి.  ఈ మద్య  ఒక వ్యాపార వేత్తతో త్రిష ప్రేమలో పడిందనీ, త్వరలోనే ఆయనతో ఆమె వివాహం జరగనుందనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. పెళ్లి తరువాత సినిమాలు మానేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలపై త్రిష స్పందించింది.  గత కొంత కాలంగా ఇండస్ట్రీలో తనపై లేనిపోని వార్తలు వస్తున్నాయని..ఇలాంటి వార్తలపై తాను రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని అన్నారు.
Image result for trisha
అంతే కాదు ప్రస్తుతం నా పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదు. నాకు నచ్చిన వ్యక్తి తారసపడితే .. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని నేనే చెబుతాను.  నా పెళ్లి విషయం పై ఎలాంటి దాపరికాలు ఉండబోవని..మీడియా సాక్షిగానే తన పెళ్లి జరుగుతుందని అన్నారు. అంతే కాదు పెళ్లైన తర్వాత చిత్రాల్లో నటిస్తానా..లేదా అన్న విషయం అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం అన్నారు. అనవసరమైన ప్రచారాలకు దయచేసి ఫుల్ స్టాప్ పెట్టేయండి అని చెప్పుకొచ్చింది.    



మరింత సమాచారం తెలుసుకోండి: