టాలీవుడ్, కోలీవుడ్ లో కమెడియన్ వడివేలు అంటే ఎంతో క్రేజ్ ఉండేది.  గత కొంత కాలంగా ఆయన తెరపై కనిపించడ లేదు. తమిళనాట బెస్ట్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వడివేలు అప్పట్లో కాల్ షీట్స్ దొరకడం అతి కష్టంగా ఉండేది.  కమెడియన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తమిళ దర్శకుడు శంకర్ నిర్మాణంలో వడివేలు హీరోగా దర్శకుడు చింబుదేవన్ తీసిన ‘హింసించేరాజు 23వ పులకేసి’ తమిళంలో అప్పట్లో బ్లాక్ బస్టర్ . తెలుగులోనూ విడుదలై ఈ సినిమా మంచి విజయం సాధించింది.  ఈ సినిమా  సీక్వెల్ గా ‘24వ పులకేసి’తీయాలని శంకర్-చింబు దేవన్ భావించారు.
Image result for హింసించే పులకేశి
ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి షూటింగుకి రెడీ చేసుకున్నాక వడివేలు గొడవపడ్డాడు. శంకర్, దర్శకుడు చింబు దేవన్‌తో అభిప్రాయభేదాలతో వడివేలు ఈ సినిమా చేయడానికి నిరాకరించాడు. అలాగని తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇవ్వలేదు.  చింబుదేవన్ దర్శకత్వంలో ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళాల్సిన ‘ఇంసై అరసన్ 24 పులకేశి’ వడివేలు కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.  దాంతో శంకర్ కి వడివేలు వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

‘ఇంసై అరసన్ 24 పులకేశి’ సినిమాకి కమిటైన ప్రధాన పాత్రధారి వడివేలు ఆ సినిమాకు చేయననటంతో విషయం నడిగర్ సంఘం వరకూ వెళ్ళింది. రెండు సంఘాల పెద్దలూ వడివేలుదే తప్పని తీర్పు చెప్పారు.  చాలా రోజులగా ఈ వివాదం ముగింపు లేకుండా నడుస్తూనే ఉంది. చివరకు వడివేలు దిగి రావడంతో సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది.  అయితే మొన్నటి వరకు మొండిగా ప్రవర్తించిన వడివేలు ఒక్కసారే యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటీ అన్న విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంది. 
Image result for వడివేలు
నడిఘర్ సంఘం తనపై జరిమానా వేస్తే. ఆర్దికంగా చాలా ఇబ్బందులు పడతానని భయపడే అంటున్నారు.శంకర్‌ తన చిత్రాన్ని పూర్తి చేయకపోతే తాను ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ. 9 కోట్లను వడివేలు తనకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  ఒకప్పుడు ‘హింసించేరాజు 23వ పులకేసి’..ఇప్పుడు ‘హింసించేరాజు 24వ పులకేసి’ ఏ రేంజ్ లో నవ్విస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: