అల్లు అర్జున్ కు మహేష్ కు మధ్య చెప్పుకోదగ్గ సాన్నిహిత్యం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఇప్పుడు బన్నీ ఎదుర్కుంటున్న సమస్యలు మహేష్ కు కూడ ఎదురవ్వడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇక్కడ ఒక తేడా కనిపిస్తుంది. 

వరసపెట్టి వస్తున్న పరాజయాల గురించి అల్లు అర్జున్ టెన్షన్ పడుతూ ఉంటే ఏ ఒక్క చిన్న తప్పు చేసినా ఎక్కడ ఫెయిల్యూర్ వస్తుందో అనే విషయంలో వీరిద్దరిభయాలు ఒకేలా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఇలా కామెంట్స్ రావడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. ‘నాపేరు సూర్య’ పరాజయం తరువాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రస్తుతం సినిమాను చేయడానికి అంగీకరించినా ఆకథ విషయంలో ఇప్పటికి కూడ అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని వార్తలు వస్తున్నాయి. 

దీనికి కారణం బన్నీని వెంటాడుతున్న ఫ్లాప్స్ భయం అని టాక్. అదేవిధంగా మహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘మహర్షి’ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో మొదలు పెట్టవలసిన మూవీ కథ కూడ ఎన్ని సార్లు స్టోరీ చర్చలు జరిగినా ఫైనల్ అవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం సుకుమార్ ‘రంగస్థలం’ తో సక్సస్ ను అందుకున్నా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తిరిగి ‘1 నేనొక్కడినే’ లాంటి ప్రయోగం తన పై ఎక్కడ చేస్తాడో అన్న భయంతో మహేష్ ఒకటికి పదిసార్లు సుకుమార్ కథకు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. 

ఇలాంటి విచిత్ర పరిస్థుతులలో అల్లు అర్జున్ మహేష్ లు త్రివిక్రమ్ సుకుమార్ ల దర్శకత్వంలో నటించబోయే సినిమాల కథలకు సంబంధించిన చర్చలు డైలీ సీరియల్ లా కొనసాగుతున్నాయి కానీ ఫైనల్ అవ్వడం లేదు అంటూ జోక్స్ పడుతున్నాయి. దీనితో విజయాల బాటలో ఉన్న మహేష్ కు పరాజయాల బాటలో ఉన్న బన్నీకి ఒకేరకం సమస్యలు వెంటాడుతున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: