గత రెండు సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో ‘2.ఒ’చిత్రం ప్రారంభం అయ్యింది.  ఈ చిత్రం మొదటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ వస్తుంది.  రోబో చిత్రానికి సీక్వెల్ గా ‘2.ఒ’తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  మొదట్లో బడ్జెట్ సమస్యలు తర్వాత టెక్నికల్ ఇబ్బందులు..ఇలా అన్ని కష్టాలు దాటుకొని సెన్సార్ పూర్తి చేసుకొని రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ‘2.ఒ’చిత్రం.  ఈ చిత్రం పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసి భారీ అంచనాలు నెలకొలిపింది.  అన్నీ ఓకే అనుకున్నతరుణంలో ‘2.ఒ’కొత్త సమస్య మొదలైంది. 
Image result for 2.o movie
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘2.0’ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం సైన్స్‌కు విరుద్ధంగా ఉందని, సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ టెలికం ఆపరేటర్లు సీబీఎఫ్‌సీ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం ట్రైలర్ లో అక్షయ్ కుమార్ ఓ డైలాగ్ చెబుతాడు..‘సెల్ ఫోన్ వాడే అందరూ నేరస్తులే’. ఇప్పుడు ఇదే కొత్త వివాదాని దారి తీసింది.
Image result for 2.o movie
మొబైల్ ఫోన్ల ఉపయోగంపై ఈ చిత్రంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల హాని జరుగుతుందని, సెల్‌ఫోన్లు, మొబైల్ టవర్లు జంతుజాలానికి హానికరమని, పశుపక్ష్యాదులు, మానవుల జీవనానికి ప్రమాదకరమని వీటివల్ల ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) ఉద్గారాలు వెలువడతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. సెల్‌ఫోన్ల వల్ల హాని జరుగుతుందని శాస్త్రీయంగా రుజువు కాలేదని పేర్కొంది.
Image result for 2.o movie
అయితే సైన్స్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోవాలని, చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని సీవోఏఐ తన ఫిర్యాదులో డిమాండ్ చేసింది. ఈ చిత్రాన్ని అన్ని థియేటర్ల వద్ద ఆపుతామని వారు హెచ్చరిస్తున్నారు.  కాగా,  ప్రభుత్వానికి తాము ఫిర్యాదు చేసిన మాట నిజమేనని  సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: