అదర గొట్టే గ్లామర్ తో వన్స్ మోర్ అనిపించుకోవడానికి ఐరా మోర్ వచ్చేస్తోంది. ఈ బ్యూటీ రామ్ గోపాల్ వర్మ డిస్కవరీ. రాము సినిమాల్లో హీరోయిన్లు హాట్ గా ఉంటారన్నది తెలిసిందే. అదే కోవలో ఐరా మోర్ ని కూడా రాము సేర్చింగ్ చేసి మరీ తన సొంత చింత్రంలో హీరోయిన్ గా పెట్టారు. ఆయన నిర్మాతగా వస్తున్న చిత్రం భైరవ గీత. ఇందులో హాట్ హాట్ అందాలతో ఐరా మోర్ యూత్ ని కిర్రాక్  పెడుతుందని అంటున్నారు. ఐరా మోర్ సెలక్షన్ పూర్తిగా రాముదే కావడంతో ఆమె అందం అభినయం పట్ల ఫుల్ కాంఫిడెన్స్ తో ఉండొచ్చు.


మీటూ ఇబ్బందులు తనకు  లేవు అంటోంది ఈ ముద్దు గుమ్మ. రాము ముక్కు సూటి మనిషి. తన మనసులో ఏదీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు బాగా నచింది. ఇక భయం అన్నది నాకు పూర్తిగా పోగొట్టి ఫస్ట్ మూవీలోనే ది బెస్ట్ అన్నట్లుగా చేయించుకున్నారని ఐరా మోర్ చేబుతోంది. తాను రంగ స్థల నటినని, సినిమాకు, ధియేటర్ ఆర్ట్స్ కు చాలా తేడా ఉందని మోర్ అంటోంది. తనకు ఈ చాన్స్ రావడం చాలా లక్ అని కూడా చెప్తోంది.


తాను తెలుగు నేర్చుకుని ఈ మూవీలో యాక్ట్ చేశానని, ఇక ఎలా చేశానో జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది ఆడియెన్స్ అంటోంది మోర్. తనకు తెలుగులో చేయాలని ఉందని చెబుతున్న ఈ అందాల భామ మహేష్ బాబు, రవి తేజా మూవీస్ మాత్రమే చూశానని అంటోంది. చాన్స్ ఇస్తే టాలీవుడ్లో మరిన్ని మూవీస్ చేయాలని ఉందని అంటున్న ఐరా మోర్ కు భైరవ గీతతో గీత మారుతుందేమో  చూడాలి. 29వ్ రజనీకాంత్  మూవీ వస్తోంది, . ఆ వెంటనే రాము సినిమా వస్తోంది. మరి ఆడియెన్స్ యాక్షన్, లవ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: