‘బాహుబలి’ కోసం మూడు సంవత్సరాలు కష్టపడిన ప్రభాస్ తన శరీరాన్ని 130 కేజీల బరువుకు తీసుకువెళ్ళి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ బరువు కోసం ప్రభాస్ పాటించిన ఆహార నియమాలు అప్పట్లో హాట్ టాపిక్. ‘భాహుబలి’ విడుదల అవగానే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రభాస్ బాగా డైటింగ్ చేసి తన బరువులో సుమారు 30 కేజీల వరకు తగ్గించుకోగలిగాడు. 
బాహుబలి కోసం 130 కేజీలు
ఆతరువాత ప్రభాస్ మొదలు పెట్టిన భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ యాక్షన్ మూవీ కావడంతో ప్రభాస్ ప్రస్తుతం తన ఒరిజినల్ శరీర ఆకృతితోనే నటిస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది తన వైపు నుండి తన అభిమానులకు రెండు సినిమాలను ఇవ్వాలని ప్రభాస్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రభాస్ వెయిట్ ఒక సమస్యగా మారిందని టాక్. 
 రొమాంటిక్ చిత్రం
జిల్ రాథాకృష్ణ దర్శకత్వంలో రూపొందింపబడుతున్న ఈమూవీ షూటింగ్ ఇప్పటికే యూరప్ లో ప్రారంభం అయింది. ఈమూవీ కథ ఒక క్యూట్ లవ్ స్టోరీ కాబట్టి ప్రభాస్ లుక్ మరింత బాగుండటానికి మరో 20 కేజీలు తగ్గితే బాగుంటుందని రాథాకృష్ణ ప్రభాస్ కు సూచించినట్లు సమాచారం. 
ఒక్క చిత్రం కూడా
దీనితో ప్రభాస్ ప్రస్తుతం ఆలుక్ కోసం పూర్తి లిక్విడ్ డైట్ తో తన లుక్ ను మెరుగు పరుచుకోవడానికి చాల గట్టిప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ వచ్చే ఏడాది విడుదల కాబోతున్న తన రెండు సినిమాలలో ‘సాహో’ లో భారీ దేహంతో జిల్ రాథాక్రిష్ణ మూవీలో క్యూట్ లవర్ బాయ్ లా సన్నగా కనిపించబోతు ఊసరవెల్లి లా మారబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: