భారతీయ చలన చిత్ర రంగంలో స్టార్ డైరెక్టర్ శంకర్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేసింది.  అప్పట్లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించింది.  చాలా కాలం తర్వాత ‘రోబో’సీక్వెల్ రూపొందింది. డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేష్ లో వస్తున్న ఈ సినిమా ‘2.ఒ’. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ చూస్తుంటే భారీ స్థాయిలో టెక్నాలజీని వాడినట్లు కనిపిస్తుంది. 
Related image
సెల్ ఫోన్ పై ఓ పక్షి రాక్షసుడు చేసే యుద్దానికి ‘రోబో’లో చిట్టి మళ్లీ రీలోడ్ చేయడం..దానిపేరు 2.ఒ వర్షన్ అని పేరు పెట్టడం ట్రైలర్ లో చూపించారు.  సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీల్లో ఇప్పటికే సినిమా టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. రజనీ సినిమాకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో టికెట్లను భారీగా పెంచి విక్రయిస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి..టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ల ప్రకారం.. కనీస టికెట్ ధర రూ. 118 కాగా, గరిష్ట ధర రూ.1550. ముంబైలో అత్యధిక ధరకు అమ్ముడుపోతున్న టికెట్లు ఇవే కావడం గమనార్హం. 
Image result for ‘2.0’ మూవీ ముంబాయి
రెండు థియేటర్లు ఈ టికెట్లను విక్రయిస్తుండగా ఓ థియేటర్‌‌లో బుకింగ్ ఇప్పటికే ముగిసింది.  అయితే టికెట్ రేట్ రూ.1550 అయినా కూడా క్షణాల్లో బుకింగ్ అయ్యాయట. ఈ లెక్కన బాహుబలి 2 రికార్డులకు ‘2.ఒ’బ్రేక్ పెట్టడం ఖాయం అని అంటున్నారు..సినీ అభిమానులు. ఇక ముంబై తర్వాత స్థానంలో ఢిల్లీ ఉంది. దేశ రాజధానిలో రూ.1450కి టికెట్లు విక్రయిస్తున్నారు.

రూ.1030 ధరతో కోల్‌కతా మూడో స్థానంలో ఉంది.  అంతే కాదు చెన్నై, బెంగళూరు, చండీగఢ్, పూణె నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా టికెట్లను విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత శంకర్, రజినీకాంత్ భారీ విజయాం పొందబోతున్నారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: