బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ సహాయం లేకపోతే ‘బాహుబలి’ అంత ఘన విజయం బాలీవుడ్ లో సాధించి ఉండేది కాదు అన్న అభిప్రాయం చాలామందికి ఉంది. ‘బాహుబలి 2’ విడుదల తరువాత కరణ్ జోహార్ కు రాజమౌళికి మధ్య చిన్నపాటి గ్యాప్ ఏర్పడినా ఆవిషయాలు ఎక్కడా బయటపడనీయకుండా కరణ్ జోహార్ రాజమౌళిని ఇప్పటికీ పొగుడుతూనే ఉంటాడు.

ప్రస్తుతం ‘2.0’ మూవీని బాలీవుడ్ లో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ ఆమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ‘బాహుబలి’ మూవీని ఉద్దేసించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. రాజమౌళి తన ‘బాహుబలి’ తో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెంపదెబ్బ కొట్టాడని అతడి వల్ల సినిమాలు భారీ స్థాయిలో ఎలా తీయాలో తెలిసి వచ్చేలా చేసి బాలీవుడ్ ఇండస్ట్రీ కళ్ళు తెరిపించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు కరణ్ జోహార్.

సంజయ్ లీలా బన్సాలీ లాంటి టాప్ దర్శకులకు ‘బాహుబలి’ మేకింగ్ ఒక పాఠం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ‘బాహుబలి’ స్థాయికి మించి సినిమాలు తీయగల సత్తా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఉందని కనువిప్పు కలిగించిన వ్యక్తి రాజమౌళి అంటూ కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 

శంకర్ దర్శకత్వం వహించిన ‘2.0’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ‘బాహుబలి’ రికార్డులు చెరిగిపోతాయి అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పైకి కరణ్ జోహార్ రాజమౌళిని పొగుడుతున్నట్లు కనిపిస్తున్నా ఈ మితిమీరిన పొగడ్తలు వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: