సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా అంటే తెలుగు, తమిళ భాషల్లో అభిమానులకు పండుగ అన్నట్టే. తమిళంలో తళైవా సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అయితే ఇదంతా ఒకప్పటి లెక్క. రోజులు మారాయి ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే విషయం లేదంటే పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.


రోబో తర్వాత రజినికి ఇలాంటి అనుభవం ఎదురైంది. లింగా, కబాలి, కాలా ఇలా సినిమాలు చేస్తున్నా రజిని రేంజ్ కు తగిన హిట్ అందుకోలేదు. అయితే తమిళంలో ఈ సినిమాలన్ని పర్వాలేదు అనిపించుకున్నా తెలుగులో మాత్రం రజిని ఇమేజ్ మీద ఆడలేదు. అందుకే 2.ఓ మీద ఎక్కువ గురి పెట్టాడు రజినికాంత్.


శంకర్, రజిని కాంబినేషన్ సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు సరితూగే సినిమానే 2.ఓ అని రోబో సీక్వల్ గా కథ రాసుకోవడం.. ప్రతినాయకుడిగా అక్షయ్ కుమార్ నటించడం సినిమాకు మరింత క్రేజ్ వచ్చేలా చేశాయి. 600 కోట్ల బడ్జెట్ తో వచ్చిన 2.ఓ రజిని స్టామినాకు అసలు సిసలు పరీక్ష పెట్టిందని చెప్పొచ్చు.


చిట్టి రోబో విన్యాసాలు ప్రేక్షకులకు నచ్చాయి. మరి దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిట్టి 2.ఓ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మాత్రం రజిని ఈ సినిమా పక్కా హిట్ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. రజిని అన్నట్టుగానే ఈ సినిమా సూపర్ హిట్ కొడుతుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: