రాజమౌళి ఒకవైపు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉంటూనే 2019 జనవరి 5న జరగబోతున్న కార్తికేయ పెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ఫిలిం ఇండస్ట్రీలో త్వరలో జరగబోతున్న ఈ టాప్ వెడ్డింగ్ అత్యంత సాంప్రదాయ పద్ధతిలో జరగబోతోంది. 
కార్తికేయ, పూజ
ఇప్పటికే ఈ పెళ్ళికి రమ్మని అందరికీ ఆహ్వానాలు అందుతున్న నేపధ్యంలో ఈ పెళ్ళి పిలుపు పై నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర ట్విట్ చేసాడు. రమారాజమౌళి స్వయంగా తన ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చి పిలిచిన పిలుపు పై బ్రహ్మాజీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. 
 రాజమౌళి కుటుంబంతో బ్రహ్మాజీ సాన్నిహిత్యం
'రమా రాజమౌళిగారు పర్సనల్‌గా ఇంటికొచ్చి ఇన్విటేషన్ అందించారు. ఈ మధ్య కొందరు మ్యారేజ్ ఇన్విటేషన్స్ మేనేజర్లను పంపించి ఫోన్లోనో, వాట్సాప్‌లోనో ఇన్వైట్ చేస్తున్నారు. కానీ రమాగారు అలా చేయలేదు. మీకు థాంక్స్’ అంటూ ట్వీట్ చేసి రాజమౌళి కుటుంబ సంస్కారాన్ని అందరికీ తెలిసేలా చేసాడు బ్రహ్మాజీ. రాజమౌళికి బ్రహ్మాజీకి ఎప్పటి నుంచో సాన్నిహిత్యం కొనసాగుతున్న నేపధ్యంలో రాజమౌళి సినిమాలలో బ్రహ్మాజీ అనేకసార్లు ప్రముఖ పాత్రలు చేసిన విషయం తెలిసిందే.
రామానాయుడు స్టూడియోలో
ప్రముఖ నటుడు జగపతిబాబు అన్నయ్య రామ్ ప్రసాద్ కూమార్తె పూజతో కార్తికేయ వివాహం జరుగబోతున్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసిందే. కార్తికేయ-పూజ కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఆతరువాత పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒకటవుతున్నారు. శాస్త్రీయ సంగీతంలో ముఖ్యంగా భక్తి సంగీతంలో అనేక పాటలు పూజ పాడి ఇప్పటికే గాయనిగా చాల మంచిపేరు తెచ్చుకుంది. జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి జరగబోతున్న ఈ పెళ్ళి వేడుకలకు జాతీయ స్థాయిలోని అనేకమంది సెలెబ్రెటీలు రాబోతున్నట్లు సమాచారం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: