రజినీకాంత్ శంకర్ ల కాంబినేషన్ కు ఒకసారి పాజిటివ్ టాక్ వస్తే అది సునామీగా మారిపోతుంది. ఇప్పుడు అదే జరిగినట్లుగా ప్రాధమిక వార్తలు వస్తున్నాయి. నిన్న అర్దరాత్రి నుండి చెన్నై మహానగరంలో ‘2.0’ ప్రదర్శింపబడుతున్న ధియేటర్ల ముందు దీపావళి పండుగ వాతావరణం కనిపిస్తోంది. బాణసంచా కాలుస్తూ రజినీకాంత్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది అంటూ అభిమానులు చేస్తున్న హడావిడితో చెన్నైలోని ధియేటర్ల ముందు దద్దరిల్లిపోతోంది. 
మరోసారి తెర మీద చిట్టి, వశీకరణ్
ఇది చాలదు అన్నట్లుగా ఓవర్సీస్ ప్రాంతాల నుండి అదేవిధంగా ఇండియాలోని ప్రధాన నగరాల నుండి ఈమూవీకి సంబంధించి బయటకు వస్తున్న ప్రీమియర్ షో టాక్ అత్యంత పాజిటివ్ గా ఉంది. దీనికితోడు ఈసినిమాను ఆకాశంలోకి ఎత్తేస్తూ రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియాలో తమ కామెంట్స్ తో అప్పుడే సందడి మొదలుపెట్టేసారు. 
విలన్‌గా అక్షయ్ స్పెషల్‌ అట్రాక్షన్
ఈమూవీని చూసి బయటకు వచ్చిన ఓవర్సీస్ ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ‘2.0’ అద్భుతమైన సినిమాగా ఉండటమే కాకుండా  ఇంటర్వెల్ సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది అని అంటున్నారు. అంతేకాదు భారత సినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన క్లైమాక్స్ ‘2.0’ లో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఓవర్సీస్ ప్రేక్షకులైతే ఈ దశాబ్దంలో అతిపెద్ద విజయంగా ‘2.0’ నిలుస్తుంది అంటూ చేస్తున్న కామెంట్స్ ఈమూవీ అంచనాలు మరింత పెంచుతున్నాయి. 
అదిరిపోయేలా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్
శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఈసినిమాలోని విజువల్స్ ఊహకు అందని స్థాయిలో అబ్బురపరుస్తాయని ఏవిషయంలోనూ హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా ‘2.0’ ఉంది అంటూ వస్తున్న ప్రాధమీక వార్తలను బట్టి ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న అభిప్రాయం కలుగుతోంది. అద్భుతమైన టైటిల్ కార్డ్స్ నుంచే ఆడియన్స్ హంగామా ‘2.0’ లో కనిపిస్తున్నట్లు సమాచారం. ఫస్టాఫ్ రజనీకాంత్ అదరగొడితే సెకండ్ హాఫ్ అక్షయ్ కుమార్ విశ్వరూపం కనిపిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి వస్తున్న పాజిటివ్ రిపోర్ట్స్ ఇలాగే నిలబడితే ‘2.0’ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం..  



మరింత సమాచారం తెలుసుకోండి: