గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా మొదట్లో ఎన్నో వివాదాలకు తెరలేపుతున్నాయి. ఆ మద్య విజయ్ నటించిన మెర్సల్ పై ఎన్నో వివాదాలు వచ్చాయి. జీఎస్టీ, వైద్యులపై ఈ సినిమాలో నెగిటీవ్ గా చూపించారి భారత దేశ వ్యాప్తంగా పెద్ద గొడవలు జరిగాయి.  తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, కీర్తి సురేష్ నటించిన ‘సర్కార్’ సినిమాపై ఎన్నో వివాదలు చెలరేగాయి. 

Image result for sarkar movie

సర్కార్ సినిమాతో దర్శకుడు మురగదాస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకున్నాడు. విజయ్ కథానాయకుడిగా తెరకెక్కించిన ఆ సినిమా ఇప్పటికే 250 కోట్లను వసూలు చేసింది. కానీ ఈ సినిమాతో ఎప్పుడు లేని విధంగా మురగదాస్ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందుగానే హైకోర్టు లో మురగదాస్ ముందస్తు బెయిల్ కు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  అయితే  ఈ సినిమా తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడులు సృష్టించింది.

Image result for sarkar movie telugu

ఇకపోతే తమిళనాడు ప్రభుత్వం కూడా మురగదాస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కోర్టు విచారణ జరుపగా ప్రభుత్వ తరపు న్యాయవాది మురగదాస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  భవిష్యత్తులో తన సినిమాల్లో ప్రభుత్వ పథకాలపై ఎలాంటి నెగిటివ్ సీన్స్ ను తీయను అని మురగదాస్ లేఖ ద్వారా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. వాదోపవాదాలు విన్నకోర్టు వీలైనంత త్వరగా దర్శకుడు ఈ విషయంపై వివరణ ఇవ్వాలని చెప్పారు. 

Image result for vijay murugadoss

తాజాగా ఈ విషయం పై  స్పందించిన దర్శకులు మురుగదాస్ ఆ పని చేయనని మురుగదాస్‌ తేల్చిచెప్పారు. ఆయనకు కమల్ హాసన్ ట్వీట్ చేసి సపోర్ట్ ఇచ్చారు.  బుధవారం జరిగిన విచారణలో మురుగదాస్‌ తరపు లాయిర్  హాజరై... ప్రభుత్వాన్ని విమర్శించబోమని తమ క్లైంట్‌ హామీ ఇవ్వరని, సినిమాల్లో సీన్స్  తన భావ స్వాతంత్ర్యానికి సంబంధించినవని, అందువల్ల క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని మురుగదాస్‌ పేర్కొన్నట్లు తెలిపారు. వాదప్రతివాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఈ కేసును డిసెంబర్‌ 13కు వాయిదా వేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: