శంకర్ విజువల్ వండర్  2.O మంచి సక్సస్ టాక్ తెచ్చుకుంటోంది. 8 ఏళ్ల క్రితం రజినీకాంత్ కు అద్బుత విజయాన్ని అందించిన శంకర్  మరోసారి రజినీకు మంచి హిట్ ఇచ్చాడన్నది ఇండస్ట్రీ టాక్. అయితే ఇంతకీ ఈ సినిమా హిట్ క్రెడిట్ ఎవరిది.. అందరికంటే  ఈ సినిమా ద్వారా బాగా పేరు తెచ్చుకున్నదెవరు... ఈ ప్రశ్నలకు మాత్రం శంకర్, రజినీ పేర్లు కాకుండా మరో పేరు తెరపైకి వస్తోంది. 

Image result for 2.0 movie akshay kumar

ఆయనే అక్షయ్ కుమార్.. ఈ సినిమాలో  రజినీకాంత్ కు దీటైన విలన్ గా నటించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటనకు ప్రేక్షకులు మంత్రముగ్దులవు తున్నారు. ప్రత్యేకించి  పక్షి రాజుగా ఆయన పలికించిన హావభావాలు, విలనిజం సినిమాకు బాగా ప్లస్ అయ్యాయంటున్నారు. ఇప్పటికే రోబోగా రజినీకాంత్ ను చూసేసిన ప్రేక్షకులు  అక్షయ్ గెటప్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోందట. 

Related image

8 ఏళ్ల క్రితం వచ్చిన రోబో సినిమాలో హీరో, విలన్ రెండు పాత్రలూ రజినీకాంత్ పోషించారు. కానీ ఇప్పుడు అంతకుమించి అలరించాల్సిన  సమయంలో శంకర్ అక్షయ్ కుమార్ ను ఎంచుకున్నారు. ఆ ఎంపిక ఏమాత్రం తప్పుకాదని అక్షయ్ తన నటనతో నిరూపించాడు. పక్షిరాజు పాత్రకు కేవలం నటన ఒక్కటే సరిపోదు.. ఆ గెటప్ కోసం వేసిన మేకప్ చాలా కష్టమైంది.
Image result for 2.0 movie akshay kumar
కేవలం మేకప్ కోసమే రోజూ మూడు గంటలు పట్టేదట. అంతటి కష్టానికి మంచి ప్రతిఫలం దక్కిందని  సినిమా యూనిట్ ఆనందపడుతోంది. హీరోగా చేయడం రొటీన్ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలే నటుడికి సంతృప్తినిస్తాయని అక్షయ్ అంటున్నారు. మొత్తానికి  అక్షయ్ రజనీని డామినేట్ చేశాడని సినీప్రియులు ముచ్చటించుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: