శంకర్ డైరక్షన్ లో వచ్చిన రోబో ఎంత పెద్ద విజయం అందుకుందో తెలిసిందే. రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పటివరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా మరింత టెక్నికల్ అప్డేట్స్ తో విజువల్ ఎఫెక్ట్స్ తో శంకర్ ఎంతో కష్టపడి రోబో తెరకెక్కించాడు.


ఇక ఆ సినిమాకు సీక్వల్ గా 8 ఏళ్ల తర్వాత 2.ఓ తీశాడు. రోబోకు అయిన బడ్జెట్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో 2.ఓ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ 2.ఓ నిర్మించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుందా అంటే లేదని అంటున్నారు ఆడియెన్స్.


రోబో సినిమాపై ఎలాంటి హోప్స్ లేవు. గ్రాఫిక్స్ ఉంటాయని తెలుసు కాని శంకర్ వాటిని అంతలా వాడి అబ్బురపరుస్తాడని ఆడియెన్స్ ఊహించలేదు. అందుకే రోబో చాలా పెద్ద విజయం నమోదు చేసుకుంది. అయితే ఆ సినిమా సీక్వల్ గా వచ్చిన 2.ఓ మాత్రం అంతకుమించిన అంచనాలను ఏర్పరచుకుంది. సాధారణంగా అంచనాలు ఎక్కువైతే ఇంకా ఏదో గొప్పగా ఆశిస్తారు. 2.ఓ విషయంలో అదే జరిగింది. 


విజువల్ వండర్ గా వచ్చిన 2.ఓ కూడా ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా రోబో రేంజ్ లో 2.ఓ లేదన్నది అందరి మాట. రోబోలో కథ దానికి తగినట్టుగా కథనం తోడుగా విఎఫెక్స్ ఎఫెక్ట్ అన్ని సూపర్ గా కుదిరాయి. కాని 2.ఓలో కథ థీం లైన్ బాగున్నా కథనం అలరించేలా సాగలేదు. శంకర్ కొన్ని చోట్ల గ్రిప్పింగ్ వదిలేశాడని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నా ఓవరాల్ గా రోబో కన్న 2.ఓ వెనుకపడ్డదని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: