రజనీకాంత్, శంకర్ల కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 2 ఓ సూపెర్ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే వచ్చిన పాజిటివ్ బజ్ సక్సెస్ ని ఎక్కడికో తీసుకుపోయింది. చాలాకాలానికి రజనీకి ఓ బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. అదే టైంలో శంకర్ సెల్యూలాయిడ్ ఇంటెలెజెన్స్ మరో మారు ప్రూవ్ అయింది. ఇపుడు అంతా మాట్లాడుకునేది ఈ మూవీ గురించే. దానితో పాటుగా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందన్న చర్చ అపుడే మొదలైపోయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా యునానిమస్ గా బంపర్ హిట్ టాక్ దక్కించుకోవడంతో సరి కొత్త డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి.


ఈ మూవీ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందన్నది అందరూ అంటున్న మాట. మరి అంతటి ఘన విజయం దక్కించుకున్న ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది. ఇదే ఇపుడు హాట్ హాట్ డిస్కషన్. ఈ మూవీని 550 కోట్లతో నిర్మించారు. రజనీకాంత్ హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ సంచలనాలను  క్రియేట్ చేస్తోంది. మరి ఈ మూవీ ద్వారా హాలీవుడ్ ని తలదన్నేలా టెక్నాలజీని యూజ్ చేశారు. ఇన్ని హంగులు ఉన్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రెండు వేల కోట్లకు పై చిలుకు సొమ్మును రాబడుతుందని అంతా భావిస్తున్నారు. ఓ విధంగా పాత రికార్డులు తిరగతోడేసి సరి కొత్త రికార్డుల వేట ఈ మూవీతో మొదలవుతుందని కూడా అంటున్నారు.


ప్రముఖ ఫిల్మ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ఈ మూవీకి టాప్ ర్యాంక్ ఇవ్వడంతో ఇక ఇండియన్ సినిమాల్లో 2 ఓ కలెక్షన్ల పరంగానూ న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఎక్కడో హాలీవుడ్ మూవీస్ మాత్రమే చూసి, వారు మాత్రమే తీయగలరనుకున్న మూవీస్ ని ఇపుడు మన వాళ్ళు కూడా తీయగలరని నిరూపించిన దిగ్దర్శకుడిగా శంకర్  తన ఘనతను చాటుకున్నారు. అటువంటి ఈ మూవీ కచ్చితంగా కలెక్షన్ల పరంగానూ జెయింట్ అనిపించుకుంటుందని భావిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాల కలెక్షన్లలో ఈ మూవీ ఓ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసి చూపిస్తుందని కూడా చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: