కధలను రాసుకోవడం కాదు, వాటిని అందంగా వెండి తెర మీద ఆవిష్కరించడంలోనే తెలివి ఉంది. ఇక కధ ఛక్కగా  చెప్పడం ఎలాగో తెలిసుండాలి. చెప్పే కధ కూడా కాలక్షేపంలా కాకుండా పది కాలాలు నిలిచేలా, పది మందికీ పనికివచ్చేలా ఉండాలి. ఈ లక్షణాలు అన్ని కలగలిపి ఉన్న దిట్ట, భారతీయ మేటి దర్శకుడు శంకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. శంకర్ తీసిన సినిమాలు మామూలివి కావు. ఆయన ఆలొచన ధోరణి చాలా భిన్నమైనది. ఒకే ఒక్కడు, భారతీయుడు. రోబో ఇలా ప్రతి మూవీలో శంకర్ ప్రతిభ కనబడుతుంది. అంతే కాదు. ఆ సినిమాల్లో  గొప్ప సందేశం కూడా ఉంటుంది.


ఇక లేటెస్ట్ మూవీ 2 వో లో శంకర్ అద్భుత‌మైన సందేశం ఇచ్చాడు. మనిషి తాను ఒక్కడే ఈ భూ మండలానికి రా రాజు అనుకుంటున్నాడు. అలా కాదు. తనతో పాటుగా 84 లక్షల జీవ రాశులు ఉన్నాయి. వాటిని కూడా కాపాడాల్సిన అవసరం మనిషికి ఉంది. అని చాటి చెప్పిన చిత్రమే 2 వో. ఏవో గ్రాఫిక్కులతో కళ్లకు విందు చేసి నాలుగు డబ్బులు వెనకేసుకోవడం కాకుండా అందమైన  సందేశాన్ని కూడా ఇవ్వాలన్న తపన ఉన్న దర్శకుడు శంకర్. అందుకు ఆయన తొలి నుంచి తీస్తున్న సినిమాలే సాక్ష్యం. ఇక 2 ఓలో శంకర్ తాను చెపాలనుకుంటున్న పాయింట్ ని హత్తుకునేలా చెప్పేందుకు టెక్నాలజీని వాడుకున్నారనిపిస్తుంది.


పక్షులు మన చిన్నపుడు ఎక్కువగా కనిపించేవి. ఇపుడు ఉన్నాయా. అసలు వాటి గురించి ఈ వేగవంతమైన యాంత్రిక జీవితంలో ఆలోచిస్తున్నామా, ఈ సినిమా మళ్ళీ మన చుట్టు ఉన్న పక్షుల గురించి తెలియచేస్తుంది. ఆ విధంగా ఆలొచింపచేస్తుంది. సెల్ ఫోన్ ఇపుడు ఓ ఫ్యాషన్. ఈ దేశంలో జనభా కంటే కూడా సెల్ ఫోన్లే ఎక్కువ. ప్రతీ వారికీ కనీసం రెండు ఫోన్లు  ఉంటున్నాయి. 


మరి ఈ సెల్ ఫోన్లకు సిగ్నల్ అందించే సెల్ టవర్లు  వెదజల్లే రేడియేషన్ మాటేమిటి. వాటి వల్ల కలిగే నష్టమేటి. పక్షులకు ఎంత ఇబ్బంది కలుగుతోంది. ఆ జీవ రాశి ఎందుకు అంతరించిపోతోంది. ఈ పాయింట్లను తన కధలో టచ్ చేసి 2 ఓ వంటి మంచి మూవీని అందించిన శంకర్ నిజంగా అభినందనీయుడే. ఆయన మేధో సంపత్తిని వెలకట్టలేమని మరో మారు ఈ మూవీ నిరూపించింది. శంకర్ ఈ మూవీ ద్వారా తాను ఎన్నో మెట్లు పైకి ఎదిగాడు, అలాగే భారతీయ సినిమాను కూడా మరెన్నో మెట్లు ఎక్కించాడు. ఈ మూవీని చూసిన తరువాత గ్రేట్ శంకర్ అనకుండా ఎవరూ  ఉండలేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: