శంకర్ సినిమా అంటేనే టెక్నాలజీ వాడకానికి పెట్టింది పేరు. ఓ ప్రాంతీయ సినిమాను కూడా హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా  ఆయన చరిత్రలో నిలుస్తారు. ఐతే.. ఎంత టెక్నాలజీ వాడినా ఆ టెక్నాలజీ వాడకానికి  తగిన కథ లేకపోతే.. ప్రేక్షకులు మెచ్చరు. ఇందుకు  గతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. 

Image result for 2.0 movie

గతంలో శంకర్ దర్శక త్వంలోనే వచ్చిన ఐ సినిమా ఈ కోవలోకే వస్తుంది. విలక్షణ నటుడు విక్రమ్ ఎంతగానో శ్రమించినా..  ఆ సినిమా ప్రేక్షకులను  ఆకట్టుకోలేకపోయింది.. రోబో సీక్వెల్ విషయంలోనూ  అలాగే జరుగుతుందా అన్న అనుమానం రజనీ అభిమానుల్లో లేకపోలేదు.  కానీ ఈసారి మాత్రం శంకర్ గురి ఏమాత్రం తప్పలేదని 2.0 చూసిన వారు చెబుతున్నారు. 

Image result for 2.0 movie

ఈ విషయం బాగా పసిగట్టిన శంకర్ .. రోబో సీక్వెల్ అయినా  భావోగ్వేగాలను  ప్రధానాంశంగా ఎంచుకున్నారు.  సినిమా కథాంశంతో తమను ప్రేక్షకులు  రిలేట్ అవ్వగలగితే ఆ సినిమా సక్సస్ అయినట్టే.. అందుకే శంకర్ ఈ సినిమాలో  స్మార్ట్ ఫోన్ ను ప్రధానాంశంగా తీసుకున్నారు.  ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అందరి చేతుల్లోనూ కనిపిస్తోంది. 

Image result for 2.0 movie

స్మార్ట్ ఫోన్ నేటి ఆధునిక మానవుడిపై చూపిస్తున్న ప్రభావాన్ని టెక్నాలజీ జోడించి హృదయానికి హత్తుకునేలా చెప్పడంలో శంకర్ సక్సస్ అయ్యారని టాక్ వస్తోంది. భారీ గ్రాఫిక్స్ వాడుతున్నాం  కదా అని వాటిపైనే డిపెండ్ కాకుండా... థలో మానవ సంబంధాలను హృద్యంగా  చెప్పడం 2.0 చిత్రానికి మంచి ప్లస్ పాయింట్ అయ్యిందని  చెబుతున్నారు. భారీ బడ్జెట్ కు అనుగుణంగా రెహ్మాన్, రూసూల్ , నీరవ్ షా వంటి దిగ్గజాలు ఈ చిత్రానికి పనిచేయడంతో సినిమా అద్భుతంగా  వచ్చిందని రజినీ అభిమానులు  చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: