రోబో 2.0 ముందు కరణ్ జోహార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. సౌత్ భారీ సినిమా ల ముందు బాలీవుడ్ ఇండస్ట్రీ చిన్నదిగా కనిపిస్తుందని నిజమే ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే . ఎందుకంటే బాహుబలి ఇండియా ఫిల్మ్ స్టామినా ను ప్రపంచానికి చాటి చెప్పింది  . ఇప్పడూ మరో సౌత్ డైరెక్టర్ శంకర్ రోబో తో దానిని కంటిన్యూ చేశాడు . నిజానికి ఇలాంటి డైరెక్టర్స్ బాలీవుడ్ లో లేరని చెప్పాల్సిందే . లేకపోతే బాలీవుడ్ ఇలాంటి సినిమాలను ఎప్పుడో తీసి ఉండేది . 

Image result for robo 2.0

బాహుబలితో ఇండియన్‌ సినిమా మార్కెట్‌ పొటెన్షియల్‌ ఎంత అనేదానిపై ఒక అవగాహన కూడా రావడం శంకర్‌ ఎప్పట్నుంచో పెండింగ్‌లో వుంచిన 'రోబో' సీక్వెల్‌కి తెర లేచింది. పాటల్లో అందమైన లొకేషన్లు, ఖరీదైన సెట్లు చూపించేసి, సమాజంలో జరుగుతోన్న అన్యాయాలపై తన హీరో గర్జించేస్తే చాలదని, ఈ తరం ఆడియన్స్‌కి కావాల్సిన స్కేల్‌లో '2.0'ని ఊహించాడు. అయితే ఊహించడం ఈజీనే కానీ ఊహించిన దానిని తెరమీదకి తేవడం అంత తేలిక కాదు. భారీ తారాగణం, లారీల కొద్దీ ధనం వున్నా 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' లాంటి మిస్‌ఫైరింగ్‌లు జరుగుతూనే వుండడం చూస్తూనే వున్నాం. ఆకాశ హర్మ్యాలు భారీ ఆకారాలున్న జంతువులు లేదా మరేదైనా ఉపద్రవం వస్తే కూలిపోవడాలు, జయంట్‌ ఆకారాలున్న వ్యక్తులు లేదా జంతువులు కొట్టుకుంటూ అందించే థ్రిల్సూ... హాలీవుడ్‌ సినిమాలకే పరిమితం అనుకుని అలాంటివి మన సినిమాల నుంచి ఆశించను కూడా ఆశించం.

Image result for robo 2.0

అనుకోవాలే కానీ అలాంటి వింతలని తెర మీదకి తీసుకురావడం, అదేస్థాయి థ్రిల్‌ని మన భాషలో, మన నటులతోను ఆస్వాదించడం వీలవుతుందని నిరూపించిందీ చిత్రం. హాలీవుడ్‌ చిత్రాలకి వున్న వనరులు, బడ్జెట్‌ మిగతా దేశాల చిత్ర పరిశ్రమలకి వీలు కాదు కనుక అవి వారు మాత్రమే తీయగలరనే నమ్మకం ఏర్పడిపోయింది. హాలీవుడ్‌ సినిమాల బడ్జెట్‌లో ఎన్నో వంతులు తక్కువలోనే శంకర్‌ అలాంటి వినోదాన్ని, సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించగలిగాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: