ఫాన్ వార్స్ అనేవి సోషల్ మీడియా లో చాలా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వచ్చిన తరవాత ఇదే పనిగా ఫాన్ వార్స్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం శంకర్ - రజినీకాంత్ ల కాంబినేషన్ లో వచ్చిన రోబో 2.0 సినిమా విడుదల సందర్భంగా రాజమౌళి గొప్పా ? శంకర్ గొప్పా ? అంటూ ఆసక్తికర విశ్లేషణ లు సోషల్ మీడియా లో నడుస్తున్నాయి.

Image result for shankar rajamouli
అవి విశ్లేషణ ల వరకే పరిమితం అయితే బాగుంటుంది కానీ మనోళ్ళు దాన్ని ఫాన్ వార్స్ గా మార్చేసి రచ్చ చేస్తుండడం షాకింగ్ గా ఉంది. తమిళ అభిమానులు 'బాహుబలి' రికార్డుల పని అయిపోయిందంటూ వెటకారం చేస్తుంటే.. తెలుగు అభిమానులు మాత్రం వాళ్ళకు  మొదటి రోజే ఏమైంది ఫస్ట్ వీకండ్ తర్వాత కదా చిట్టి రోబో సత్తా బయటపడేది అంటూ సమాధానం ఇస్తున్నారు.   
Image result for shankar rajamouli

సినిమా బాగుండాలి - కలక్షన్ లు రావాలి అని కోరుకోవాలి గానీ ఇలా ఫాన్ వార్స్ ఏంటి అంటూ కొందరు మండి పడుతూ ఉన్నారు.  రీసెంట్ గా ఆమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' లాంటి సినిమా పరిస్థితి ఏమైందనేది అందరి తెలుసు.

Image result for shankar rajamouli
  ఇక ఈ ట్రోలింగ్ జనాల ఫ్రస్ట్రేషన్ ఇలా ఉంటే.. '2.0' పైన ఫన్నీ మీమ్స్ మాత్రం నెటిజనులను అలరిస్తున్నాయి. మరొక పక్క ఈ సినిమా టాక్ బ్లాక్ బస్టర్ గా నడుస్తోంది. వాదించుకునే వాళ్ళు వాదించుకోవడమే కాకుండా మధ్యలో రాజమౌళి నీ శంకర్ నీ టాగ్ చేసి మరీ తిట్ల వర్షం కురిపించడం దారుణం అంటున్నారు కొందరు. 


Related image

మరింత సమాచారం తెలుసుకోండి: