రోబో ఎంతటి సంచలన విజయం అందుకుందో ఆ సినిమా సీక్వల్ అనగానే అంతకుమించిన అంచనాలు 2.ఓ సినిమాకు ఏర్పడ్డాయి. 600 కోట్ల బడ్జెట్ తో వచ్చిన 2.ఓ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హైలెట్ గా చెప్పుకోవాల్సిన అంశాల గురించి ప్రస్థావించాల్సి వస్తే.. ముందుగా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. 


ప్రతి సీన్ లో గ్రాఫిక్స్ అద్భుతంగా కుదిరాయి. ఇక 3డిలో ఈ సినిమా స్పెషల్ గా అనిపిస్తుంది. ఎందుకు ఇది 3డిలో చూడాలో సినిమా చూశాక అర్ధమవుతుంది. 3డి ఎఫెక్ట్స్ బాగా అనిపిస్తుంది.
ఇక సినిమాలో పక్షి రాజుగా అక్షయ్ కుమార్ నటన ఆయన చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సినిమాలో రజినికి సరిసమానమైన పాత్రతో అక్షయ్ అదరగొట్టాడు. పక్షి రాజుగా కొన్ని పోస్టర్స్ లో అద్భుతంగా ఉన్నారు అక్షయ్ కుమార్. 


పక్షి రాజు ప్రజల మీద కక్ష్య కట్టి చేస్తున్న విధ్వంసం టైంలో చిట్టి వచ్చి ప్రజలను కాపాడి.. పక్షి రాజుని ఓడించే సీన్ బాగుంటుంది. ఒక్కసారిగా మన చూస్తుంది ఇండియన్ సినిమా అన్నది మర్చిపోయేలా చేశాడు శంకర్.
ఇంటర్వల్ కు ముందు చిట్టికి పక్షి రాజుకి మధ్య జరిగే ఫైట్ సీన్ సినిమా హైలెటెడ్ సీన్స్ లో ఒకటి. అక్షయ్ కుమార్ రివీల్ అయ్యే సీన్ సినిమాలో ఇది కీలక సన్నివేశంగా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత వచ్చే ఇంటర్వల్ సీన్ కూడా బాగుంటుంది.


పక్షి రాజు తన గతం చెప్పడం.. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షుల వినాశనం ఎలా జరుగుతుంది అని చెప్పడం బాగుంటుంది. సెల్ ఫోన్స్ వల్ల నష్టాలను కూడా వివరించాడు శంకర్. 
ఇక ప్రీ క్లైమాక్స్ సీన్స్ కూడా బాగున్నాయి. పక్షి రాజు వశీకర్ లో దూరడం.. కొద్దిసేపు వశీకర్ గా కొద్దిసేపు పక్షి రాజుగా రజిని చేసిన నటన బాగుంటుంది. రజిని ఫ్యాన్స్ కు ఈ సీన్ ఒక్కటి చాలు సినిమాను మరో రెండు మూడు సార్లు చూసేందుకు అన్నట్టుగా ఉంటుంది.


క్లైమాక్స్ స్టేడియం లో ఫైట్ కూడా చాలా గ్రాండియర్ గా ఉంటుంది. హండ్రెడ్స్ ఆఫ్ రోబో చిట్టిల ఎంట్రీ ఇచ్చి పక్షి రాజుని అంతం చేసే సీన్ కూడా బాగుంది. ఇక క్లైమాక్స్ లో బుల్లి రోబో వర్షన్ 3.ఓ.. అతను చేసిన కామెడీ అలరించింది. మొత్తానికి 2.ఓ శంకర్ డైరక్షన్ లో వచ్చిన మరో అద్భుతమైన సినిమా.  



మరింత సమాచారం తెలుసుకోండి: