ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన సోదరి సుహాసిని ఎన్నికల ప్రచార విషయంలో ఎదుర్కుంటున్న తీవ్రమైన ఒత్తిడికి రాజమౌళి వ్యూహాత్మక సహకారం లభించింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఈనెల 19న మొదలై మొదటిగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1కి పూర్తికావాలి. 
ఈ సమీకరణాలతో సుహాసినికి భారీ మెజార్టీ ఖాయమంటున్నారు
అయితే అనూహ్యంగా ఈ షెడ్యూల్ ను మరొక నాలుగురోజులు పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పొడిగింపు ప్రక్రియ అంతా తెలంగాణ ఎన్నికలలో జూనియర్ తన సోదరి సుహాసినికి ప్రచారం చేయలేదు అన్న అపవాదు నుండి జూనియర్ ని రక్షించడానికి అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
సుహాసినిని ఓడించాలన్న కోరిక నెరవేరేనా?
వాస్తవానికి జూనియర్ కళ్యాణ్ రామ్ లకు ప్రస్తుత తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టి అపఖ్యాతి పాలవడం ఇష్టం లేదు అన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు జూనియర్ స్వయంగా రంగంలోకి దిగి సుహాసిని కోసం ప్రచారం చేసినా ఆమె గెలుపు గురించి కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో జూనియర్ ప్రచారం చేసినా ఓట్లు పడలేదు అని అనిపించుకోవడం ప్రస్తుతం అతడికి ఇష్టం లేదు అనే మాటలు కూడ వినిపిస్తున్నాయి.

దీనికితోడు తెలంగాణ ప్రాంతంలో కూడ జూనియర్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్న నేపధ్యంలో ఈ ఎన్నికల రాజకీయాలతో తన అభిమానుల మధ్య చీలిక రావడం జూనియర్ కు ఇష్టం లేదు అన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థుతులలో అపవాడులకు అనుమానాలకు తావు ఇవ్వకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను మరో నాలుగురోజులు రాజమౌళి సహకారంతో పొడిగించుకుని చాల తెలివిగా జూనియర్ ఈసున్నిత సమస్య నుంచి బయటపడుతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: