నిన్నతిరోజున విడుదలైన ‘2.ఓ’ కేవలం మన ఇండియాలోనే 100 కోట్ల కలక్షన్స్ వసూలు చేసింది అని వార్తలు వస్తున్నాయి. ఇప్పట్లో ఈసినిమాకు పోటీ ఇవ్వగల ఏభారీ మూవీ లేకపోవడంతో కనీసం రెండు వారాల పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఈమూవీ మ్యానియా షేక్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 
ఫస్టాఫ్‌లో
ఈమూవీ దర్శకుడు శంకర్ తాను తీసే సినిమాల కోసం కోట్ల రూపాయలను చిత్తు కాగితాలులా ఖర్చు పెడతాడు అన్న పేరు ఉన్నా ఈమూవీలో ఏమీ ప్రయోజనం లేని ఒక్క పాట కోసం  4 భారీ సెట్లు వేయించి 20 కోట్లు ఎందుకు ఖర్చు చేసాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. సంగీత దర్శకుడు రెహ్మాన్ ను 2-3 రోజుల ఇబ్బంది పెట్టి ‘యంతరలోకపు సుందరివే’ ట్యూన్ ను సంపాదించిన శంకర్ రజినీకాంత్ అనారోగ్యాన్ని కూడ లెక్క చేయకుండా ఈపాటను హీరోహీరోయిన్లతో 10 రోజుల పాటు షూట్ చేశాడు. 
సెకండాఫ్‌లో
దానికి గ్రాఫిక్స్ అద్ది చాల హడావిడి చేసాడు. అయితే ఇంత కష్టపడి ఈపాటను ఈమూవీ చివర వచ్చే రోలింగ్ టైటిల్స్ దగ్గర పెట్టడంతో అసలు ఈపాట శంకర్ ఎందుకు తీసాడు అన్న అనుమానం చాలామందికి వస్తోంది. ‘యంతరలోకపు సుందరివే’ అంటూ ఈమూవీలోని పాట వస్తూ ఉంటే ఈసినిమాకు సంబంధించిన ఎండ్-టైటిల్స్ పడుతూ ఉంటాయి. దీనితో ఈ ఖరీదైన ఈపాటనుపట్టించుకోకుండా జనం సినిమా అయిపోయింది అని భావించుకుని ధియేటర్ల నుండి బయటకు వచ్చేస్తున్నారు. 
2.O మూవీ ట్విస్టులు
దీనితో 20 కోట్ల పాట 2.0 సినిమాలో వృధా అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఒక్కపాట కోసం ఖర్చు పెట్టిన డబ్బుతో నాలుగు చిన్న సినిమాలు తీయవచ్చు. కానీ ఇలాంటి వృధాను శంకర్ పట్టించుకోడు. సినిమాల విషయంలో ఇంత వృధా చేసే శంకర్ తన నిజ జీవితంలో కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటూ కూడ చాల పొడుపు పాటిస్తాడు అన్న విషయం చాల కొద్దిమందికి మాత్రమే తెలిసిన సత్యం..  


మరింత సమాచారం తెలుసుకోండి: