ఎన్నో కలలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు వర్థమాన నటీమణులు.  అందులో కొద్ది మాత్రమే సక్సెస్ సాధించగా కనీసం చిన్న పాత్రలు వచ్చినా చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు కొంత మంది నటీమణులు.  ఇండస్ట్రీలో సెలబ్రెటీగా ఉంటూ సినీ ఛాన్స్ లు రాక ఆర్థిక ఇబ్బందులతో పలువురు నటీ, నటులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో చూశాం. ఈ నేపథ్యంలో నిన్న తమిళ యంగ్ హీరోయిన్ రియామిక (26) ఆత్మహత్య  కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆశించిన విధంగా అవకాశాలు రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన హీరోయిన్ రియామిక్క చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.   
Image result for tamil actress riyamikka suicide
రియామిక ‘కుండ్రాథిలే కుమరనుకు కొండట్టాం, అగోరి ఇన్ అట్టమ్ ఆరంభం’ చిత్రాల్లో లీడ్ రోల్ పోషించింది.  అయితే ఆమె మరణం వెనుక పలు కోణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నైలో విద్యను అభ్యసించిన రియామిక స్వస్థలం ఈరోడ్ కాగా, తన పిన్ని కొడుకు ప్రకాష్ తో కలసి వలసరవాక్కం ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఉంటోంది.   రియామిక కారంబాక్కం ప్రాంతంలో జిమ్ ట్రయినర్ గా పనిచేస్తున్న దినేష్ అనే యువకుడితో ప్రేమలో ఉందని తెలుస్తోంది.
Image result for tamil actress riyamikka suicide
'కుండ్రత్తిలే కుమరనుక్కు కొండాట్టం', 'ఎక్స్‌ మీడియా' చిత్రాల్లో నటించిన తర్వాత సరైన అవకాశాలు లేకపోవడం బి గ్రేడ్ చిత్రంలో నటించింది. దాంతో ఆమె స్నేహితురాళ్లు, ఇండస్ట్రీలో కొంత మంది రియామికను హేళన చేయడంతో మానసికంగా కృంగిపోయినట్లు సమాచారం.  ఈ క్రమంలోనే ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోదరుడి  ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కేసును పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్టు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: