సాధారణంగా టాప్ హీరోలు ఒక సినిమా తరువాత మరో సినిమాను నటించడానికి గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ఒకేసారి నాలుగు భారీ సినిమాల బరువును మోస్తూ ఇండస్ట్రీ వర్గాలకు ముఖ్యంగా టాప్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. 

‘రంగస్థలం’ మూవీ తరువాత చరణ్ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ షూటింగ్ చివరి దశలో ఉండగానే చరణ్ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో పాల్గొంటూ భారీ ఫైట్స్ సీన్స్ లో నటిస్తున్నాడు. అంతేకాదు ఒకవైపు తాను చిరంజీవితో నిర్మిస్తున్న ‘సైరా’ ప్రొడక్షన్ వ్యవహారాలను చక్క పెడుతూనే మరొకవైపు వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న కొరటాల శివ చిరంజీవిల మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను చూస్తూ అక్కడ కూడ తన సూచనలను ఇస్తున్నాడు. 

దీనితో చరణ్ ప్రస్తుతం నాలుగు భారీ సినిమాలలో నటిస్తున్నంత ఎక్కువ పని భారాన్ని ఏమాత్రం అలసట లేకుండా హ్యాండిల్ చేస్తున్నాడు అంటూ చరణ్ పై ప్రశంసలు వస్తున్నాయి. అంతేకాదు ఇంత స్ట్రస్ మేనేజ్మెంట్ ఎలాంటి సమస్యలు లేకుండా చరణ్ ఇంత సులువుగా ఎలా సమర్ధవంతంగా నిర్వహించ గలుగుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాకుండా మెగా కాంపౌండ్ వర్గాలు కూడ ఆశ్చర్య పోతున్నట్లు టాక్. 

చరణ్ ఇలా చాకచక్యంగా వ్యవహరించడానికి గల కారణం అతడి టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలలో నటించేడప్పుడు మాత్రమే హీరోగా ఉంటూ మిగతా సమయాలలో తన వివిధ వ్యాపారాలకు సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా నిర్మాతగా చిరంజీవితో సినిమాలు తీస్తూ తనలోని వ్యాపార కోణాన్ని కూడ మెరుగుపరుచుకుంటున్నాడు అని కామెంట్స్ వస్తున్నాయి. అక్కినేని నాగార్జున లాంటి టాప్ హీరో తన కొడుకు అఖిల్ బాధ్యతను చరణ్ కు అప్పచెప్పాడు అంటే చరణ్ నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడ రాణిస్తున్నాడు అని చెప్పడానికి ఉదాహరణ అంటూ ఇదాస్త్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: