ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆర్ ఆర్ ఆర్’ 11-11-11 సెంటిమెంట్ తో మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నడుస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ షెడ్యూల్ మరి కొన్ని రోజులలో ముగుస్తోంది. దీని తరువాత ఈసినిమాకు ఇప్పటికే వచ్చిన క్రేజ్ ను మరింత పెంచడానికి రాజమౌళి 12-12-12 సెంటిమెంట్ ను ప్రయోగించబోతున్నట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు డిసెంబర్ నెల 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 12నిముషాలకు రాజమౌళి ఈసినిమాలో నటించబోయే హీరోయిన్స్ పేర్లు అనౌన్స్ చేసి ఈసినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను అధికారికంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఈ కార్యక్రమం తరువాత రాజమౌళి తన కొడుకు కార్తికేయ పెళ్ళి ఏర్పాట్లు చూసుకుంటూ తిరిగి వచ్చేనెల సంక్రాంతి తరువాత మాత్రమే ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ మళ్ళీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. 

వాస్తవానికి డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు. ఈ డేట్ ను రాజమౌళి అనుకోకుండా వ్యూహాత్మకంగా ‘ఆర్ ఆర్ ఆర్’ వాడటం వెనుక ఈమూవీకి కోలీవుడ్ లో కూడ మంచి ప్రచారం జరగాలి అన్న ఉద్దేశ్యం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘2.ఓ’ ఘన విజయంతో రజినీకాంత్ మ్యానియా మళ్ళీ తారా స్థాయికి చేరుకోవడంతో రాజమౌళి ఇలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు అనుకోవాలి.

తెలుస్తున్న సమాచారం మేరకు డిసెంబర్ 12న ఈమూవీలో నటించే నటీ నటుల పేర్లు అన్నీ రాజమౌళి ప్రకటిస్తాడని టాక్. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి హీరోయిన్స్ గా కీర్తి సురేశ్ రష్మికల ఎంపిక ఖరారు అయింది అన్న వార్తలు వస్తున్నాయి. వీరికితోడు మరో బాలీవుడ్ హీరోయిన్ పేరు కూడ ప్రస్తుతం రాజమౌళి దృష్టిలో ఉంది అన్న ప్రచారం జరుగుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: