జబర్దస్త్ కార్యక్రమం తెలుగు టీవీ ఛానళ్లలో అత్యధిక రేటింగ్ ఉంటే ప్రోగ్రాముల్లో ఒకటి. ఐతే.. ఈ కార్యక్రమంలో క్రమంగా నవ్వించే సత్తా కరవవుతోందా.. అందుకే కామెడీ పేరుతో వెకిలి హాస్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలోనూ బజర్దస్త్ కామెడీ అనేక సార్లు విమర్శలపాలైంది.


లేటెస్టుగా కొన్ని ఎపిసోడ్ల నుంచి స్కిట్లలో మిర్చి ఘాటు పెరిగింది. స్కిట్లలో ఆర్టిస్టులతో మిరపకాయలు తినిపించడం.. ఆ ఘాటు తట్టుకోలేక వాళ్లు అవస్తలు పడుతుంటే జడ్జిలైన నాగబాబు, రోజాలు అమితానందం పొందడం చూసేవారికి వెగటు పుట్టించే స్థాయికి చేరుతోంది. మొదట్లో చమ్మక్ చంద్ర స్కిట్ తో ఈ మిర్చి ఎపిసోడ్ మొదలైంది.


చమ్మక్ చంద్ర ఎపిసోడ్ కాస్త బావుందనే టాక్ వచ్చేసరికి ఇక మిగిలిన వాళ్లు కూడా తమ స్కిట్లలో మిరపకాయలు ప్రవేశపెట్టేశారు. సుడిగాలి సుధీర్ టీమ్ కూడా ఓ స్కిట్ ను ఇలా మిరపకాయలపైనే లాగించేసింది. ఆ తర్వాత లేటెస్టుగా సునామీ సుధాకర్ టీమ్ కూడా పూర్తిగా మిరపకాయలపైనే డిపెండ్ అయ్యి స్కిట్ నడిపించింది.


ఇలా ఆర్టిస్టులంతా వరసపెట్టి మిరపకాయలు నమలడం.. అదేదో బ్రహ్మాండమైన కామెడీ అయినట్టు జడ్జిలు పగలపడి నవ్వడం ప్రేక్షకులకు వెగటుపుట్టిస్తోంది. మిరపకాయలు తిని అవస్థలు పడుతుంటే దాన్ని కామెడీ అనడం ఏంటని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: