ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే ఇండియా ఓడిపోవాలని పాకిస్తాన్ ప్రజలు ఎంతగానో కోరుకుంటారు. దాయాది దేశాలుగా పేరుగాంచిన ఇండియా పాకిస్తాన్ విడిపోయి 70 సంవత్సరాలు గడిచిపోయినా ఈ రెండు దేశాల మధ్యా శతృత్వం కొనసాగుతూనే ఉంది. 
 పాకిస్థాన్‌లో రజనీకాంత్ ఫ్యాన్స్
పాకిస్తాన్ లో మన హిందీ సినిమాలు తప్ప దక్షిణాది భాషలకు చెందిన ఏహీరో సినిమాని ఆసినిమాలు హిందీలో డబ్ చేయడం జరిగినా పాకిస్తాన్ ప్రేజలు చూడరు. అలాంటిది ఇప్పటివరకు జపాన్ మలేషియా సింగపూర్ లకు మాత్రమే పరిమితం అయిన రజినీకాంత్ మ్యానియా ఇప్పుడు ఏకంగా మన పోరుగు దేశం పాకిస్తాన్ కు ఒక సునామిలా తాకటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 
2.0 ఫీవర్
నిన్న విడుదలైన రజినీకాంత్ ‘2.ఓ’ హిందీ వెర్షన్ ను పాకిస్తాన్ లో కూడా విడుదల చేసారు. అయితే కేవలం 20 ధియేటర్లలో విడుదలైన ఈమూవీకి విపరీతమైన స్పందన పాకిస్తాన్ ప్రేక్షకుల నుండి కూడ రావడంతో ఈమూవీని మరో 75 ధియేటర్లలో పాకిస్తాన్ దేశంలోని వివిధ ప్రాంతాలలో విడుదల చేస్తున్నారు. 
పాకిస్థాన్లో అదనంగా మూడు రెట్ల స్క్రీన్స్ పెంపు
బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలకు వచ్చే స్థాయికి మించిన స్పందన ‘2.ఓ’ కు పాకిస్తాన్ లో రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు అన్నీ ‘బాహుబలి 2’ పై ఉన్న నేపధ్యంలో ఈ రికార్డులు అన్నింటిని ఇప్పుడు ‘2.ఓ’ బ్రేక్ చేస్తుంది అని జరుగుతున్న ప్రచారం చూస్తే రాజమౌళి రికార్డులు మరి ఎంతో కాలం నిలిచి ఉండే అవకాసం కనిపించడం లేదు. కళలకు క్రీడలకు దేశాల మధ్య వైరం ఏమాత్రం అడ్డు కాదు అన్న విషయం రజినీకాంత్ మ్యానియా మరొకసారి రుజువు చేస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: