బాహుబలి సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ ప్రాంతీయ భాషా చిత్రం అన్ని సరిహద్దులు చెరిపేసి అంతర్జాతీయ స్థాయిని అందుకుంది. చివరకు చైనాలోనూ విడుదలై అలరించింది. బాహుబలి చిత్రం సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.


Image result for bahubali the beginning photos

అలాంటి బాహుబలి ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి పార్ట్ వన్ మూవీ వచ్చే ఏడాది లండన్ లోని విశ్వవిఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించబోతోంది. ఈ హాల్ లో ప్రదర్శించడం అంత గొప్పా అన్న అనుమానం రావచ్చు. ప్రపంచంలోనే గొప్ప సినిమాలు మాత్రమే ప్రదర్శించే ఈ హాల్ లో ఇప్పటివరకూ ఒక్క సౌత్ ఆసియా సినిమా కూడా ప్రదర్శించబడలేదు.


Image result for royal albert hall

ఇలాంటి గౌరవం దక్కుతున్న మొట్టమొదటి సౌత్ ఆసియా మూవీ బాహుబలి మాత్రమే కావడం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ సినిమాలైన హారీ పోటర్ అండ్ గోబ్లెట్ ఆఫ్ ఫైర్, స్కైఫాల్ లతో పాటు బాహుబలి వన్ ను ఇక్కడ వచ్చే ఏడాది ప్రదర్శిస్తారు. పూర్తి విభిన్నంగా ఉండటం వల్లే ఈ సినిమాను ఎంపిక చేసినట్టు రాయల్ ఆల్బర్ట హాల్ యాజమాన్యం తెలిపింది.


Image result for BAHUBALI AND RAJAMOULI

ఈ గౌరవం పట్ల దర్శక దిగ్గజం రాజమౌళి అమితానం వ్యక్తం చేశారు. గతంలో ఈ ఆల్బర్డ్ హాల్ లో ఓ చిత్ర ప్రదర్శన కోసం వెళ్లినప్పుడు ఇక్కడ బాహుబలి ప్రదర్శిస్తే ఎంత బావుంటుందో అని అనుకున్నామని.. తథాస్తు దేవతల ఆశీర్వాదం వల్ల ఇప్పుడు ఆ ఊహ నిజం కాబోతోందని ట్విట్టర్ లో తెలిపారు. సో.. ఆల్బర్డ్ హాల్ తెరపై హారీపోటర్, జేమ్స్ బాండ్ తో పాటు మన అమరేంద్ర బాహుబలి కూడా సందడి చేయబోతున్నాడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: