సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో.. ఎస్‌ శంకర్‌ దర్శకత్వంలో విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన 2.0 అన్ని రికార్డులను తిరగరాస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా '2.ఓ' గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా సాధిస్తోన్న వసూళ్లను గురించి .. కొత్తగా నమోదు చేస్తోన్న రికార్డులను గురించి చర్చించుకుంటున్నారు.  ప్రపంచవ్యాప్తంగా పదివేల స్క్రీన్లలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది.
Image result for 2.0 movie
ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీలో 110 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.. కేవలం ఒక్క హిందీలోనే రూ.25 కోట్లకుపైగా వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. బాహుబలి2, కబాలి, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రాలకు వచ్చిన రికార్డులను అధిగమించే దిశగా 2.0 పయనిస్తోంది. దాదాపు రూ. 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అదే రేంజ్ లో వసూళ్లను కూడా రాబడుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్.  వీక్ ఎండ్ కావడంతో  ఈ ఆదివారం నాటికీ 300 కోట్లు పైగానే షేర్ వసూలు చేసే అవకాశమున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
Image result for 2.0 movie
ప్రముఖ సినీ విమర్శకుడు, యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు  ఇది రజనీకాంత్, ‘అక్షయ్ కుమార్ ఫ్యాన్స్‌కి సెలబ్రేషన్ టైమ్. 2.ఓ కోలీవుడ్‌లోని అన్ని కలెక్షన్ల రికార్డులను బద్దలుకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఏకంగా రూ.110 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది’ ట్విట్ చేశారు.  అంతే కాదు..‘ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడు కోలీవుడ్ చిత్రాలు 1. ‘2.ఓ’ = రూ.110+ కోట్లు (రికార్డ్), 2. కబాలీ = రూ.80 కోట్లు, 3.సర్కార్ = రూ.70 కోట్లు’ అని మరో ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో  అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా మొదటి రోజు 12.43 కోట్ల షేర్ వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. 

ఏరియాల వారీగా ‘2.O’కలెక్షన్ల వివరాలు:

నైజాం - రూ.4.75 కోట్లు 
వైజాగ్- రూ.1.64 కోట్లు 
ఈస్ట్- రూ.0.96 కోట్లు 
వెస్ట్- రూ.0.75 కోట్లు 
కృష్ణ- రూ.0.70 కోట్లు 
గుంటూరు- రూ.1.02 కోట్లు 
నెల్లూరు- రూ.0.71 కోట్లు 
సీడెడ్- రూ.1.90 కోట్లు 


మొత్తం కలిపి 12.43 కోట్ల షేర్ ని రాబట్టింది. లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: