ప్రిన్స్  మహేష్ బాబు హీరోగానే కాకుండా కొత్త వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనే ఉద్దేశ్యంతో ఏషియన్ సినిమాస్ తో కలిసి భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టిన విషయం తెల్సిందే. ఏ ఎమ్ బి అంటూ ఈ మల్టీప్లెక్స్ కు పేరు పెట్టారు. వాస్తానికి ఈ మల్టీప్లెక్స్ ను ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రంతో దీపావళినాడు ప్రారంభించాలి.
3డీ టెక్నాలజీతో
అయితే అది కుదరకపోవడంతో ‘2.ఓ’ చిత్రంతో ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభం అవుతుంది అనుకున్నారు. అయితే కొన్ని కారణాలు వల్ల ఆ తేదీకి కూడ కుదరక పోవడంతో డిసెంబర్ 2న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతోంది. అత్యాధునిక హంగులతో విదేశీయ టెక్నాలజీని ఉపయోగించి ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. దీoట్లో మొత్తం 7 స్క్రీన్ లు ఉండనున్నాయి. అందులో ఆరు స్క్రీన్స్ లలో సినిమాలను ప్రదర్శించనున్నారు. ఒక స్క్రీన్ ను ప్రైవేట్ గా అద్దెకు ఇవ్వడం కాని ప్రత్యేక షోలకు ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. 
 ఏషియన్ సంస్థతో మహేష్ కలిసి
సీటింగ్ సౌండ్ సిస్టమ్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా తీర్చి దిద్దారట. హైదరాబాద్ లోని కొండాపూర్ కొత్తగూడ జంక్షన్ వద్ద నిర్మాణం జరిగిన ఈ మల్టీప్లెక్స్ మొత్తం సీట్ల కెపాసిటీ 1500లకు పైగానే ఉంటుందట. ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్‌ను ఆదివారం డిసెంబర్ 2న రజనీకాంత్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన ఈ ధియేటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా ఉండే రామ్ గోపాల్ వర్మ విభిన్నంగా స్పందించాడు. ‘మహేష్ నిర్మించిన థియేటర్ వాతావరణం చూస్తే మతిపోయింది. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ కూడా అంతే బ్యూటీఫుల్‌గా ఉంది’ అంటూ ట్వీట్‌ చేసి తన ప్రసంసలు కురిపించాడు. అయితే ఎవరి విషయంలో అయినా వర్మ చేసే ప్రసంసలు వెనుక ఎదో ఒక కనిపించని సెటైర్ ఉంటుంది కాబట్టి వర్మ కామెంట్స్ వెనుక అర్ధాలు ఏమిటి అంటూ మహేష్ అభిమానులు ఆలోచనలు చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: