‘బాహుబలి’ మూవీని తీసింది రాజమౌళి అయినా ఆమూవీని బాలీవుడ్ లో ప్రమోట్ చేసిన ఘనత కరణ్ జోహార్ కి దక్కుతుంది. ‘బాహుబలి’ ఘన విజయం తరువాత కరణ్ జోహార్ ప్రభాస్ తో ఒక హిందీ సినిమా తీయాలని చాల గట్టిగా ప్రయత్నాలు చేసాడు. అయితే కారణాలు బయటకు రాకపోయినప్పటికీ ప్రభాస్ కరణ్ జోహార్ ప్రయత్నాలకు సహకరించలేదు.
 బాబోయ్... ఇదంతా కరణ్ జోహార్ ప్లానింగేనంట!
దీనితో కరణ్ జోహార్ కు ప్రభాస్ పై బాగా కోపం వచ్చింది అన్న వార్తలు కూడ బాలీవుడ్ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు అనుకోకుండా ప్రభాస్ కు చెక్ పెట్టే అవకాశం కరణ్ జోహార్ లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కరణ్ జోహార్ ప్రభాస్ కోసం తలపెట్టిన మూవీ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండతో ఇంచుమించు ఫైనల్ అయింది అని వార్తలు వస్తున్నాయి. 
 త్వరలో కరణ్, జాహ్నవిలతో సినిమా చేస్తానన్న విజయ్
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్యనే విజయ్ దేవరకొండ ముంబాయ్ వెళ్లి కరణ్ జోహార్ ను కలవడం జరిగిందని ఈమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రాధమిక చర్చలు జరిగాయని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈమధ్య ఒక హిందీ ఛానల్ లో ప్రసారం అయిన ‘కాఫీ విత్’ కరణ్ జోహార్ కార్యక్రమంలో జాహ్నవి చేత విజయ్ దేవరకొండ పై ప్రశంసలు కురిపించే కామెంట్స్ చేయడం వెనుక ఈమూవీ ప్రాజెక్ట్ అంతర్లీనంగా ఉంది అని బాలీవుడ్ మీడియా అభిప్రాయ పడుతోంది.

ఈవార్తలే నిజం అయితే ‘సాహో’ విడుదల తరువాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రభాస్ ఆలోచనలకు విజయ్ దేవరకొండ ముందుగానే కరణ్ జోజార్ సహాయంతో చెక్ పెడుతున్నాడనుకోవాలి. ఇప్పటికే ఊహించని జెట్ స్పీడ్ తో టాలీవుడ్ సూపర్ హీరోల లిస్టులో చేరిపోయిన విజయ్ దేవరకొండకు ఇది ఊహించని జాక్ పాట్ అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: