కాజల్ మగధీర తరువాత తెలుగు లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగి పోయింది . వరుసగా టాప్ హీరోలా సరసన నటిస్తూ మంచి నటీగా గుర్తింపు తెచ్చుకున్నది . అయితే  విదేశీ లొకేషన్లలో దిగిన హాట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రమ్ ద్వారా షేర్ చేస్తోంది కాజల్ అగర్వాల్. ఇలా తన అభిమానులను పలకరిస్తోంది ఈ భామ. వయసు మీద పడుతున్నా.. తనలో గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని కాజల్ నిరూపించుకుంటోంది. ఇదే సమయంలో భారీ సినిమాల్లో అవకాశాలను ఈ మార్వాడీ భామ అందిపుచ్చుకుంటోంది. 

Image result for kajal

కవచం సినిమాలో నటిస్తున్న కాజల్.. తమిళ ప్రముఖ హీరో జయం రవి సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఆ పై శంకర్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ కాజల్ కు దక్కిందని వార్తలు వస్తున్నాయి. భారతీయుడు రెండో పార్టులో కాజల్ ఒక హీరోయిన్ గా నటించబోతోందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నాయి. కాజల్ కు శంకర్ సినిమాలో నటించడం మంచి గుర్తింపే కానీ.. శంకర్ సినిమాల్లో నటించే హీరోయిన్లలో చాలా మంది ఆ తర్వాత కెరీర్ ను కొనసాగించలేకపోవడం అనే సెంటిమెంట్ ఉంది.

Image result for kajal

శంకర్ సినిమాల్లో నటించిన తర్వాత చాలా మంది హీరోయిన్లకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. సదరు సినిమాలు హిట్ అయినా.. వాళ్ల  కెరీర్ తిరోగమనంలోనే సాగింది. అందరి కెరీర్లూ కాదు శంకర్ సినిమాల హీరోయిన్లలో చాలా మంది పరిస్థితి అదే. ఆ సెంటిమెంట్ ను కాజల్ జయిస్తుందేమో చూడాలి! మొత్తానికి ఇటువంటి హాట్ ఫొటోస్ తో కాజల్ తన అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుందని చెప్పాలి...!

మరింత సమాచారం తెలుసుకోండి: