‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘సైరా’ వచ్చే ఏడాది సమ్మర్ రేసుకు కాని లేదంటే వచ్చే ఏడాది ఆగష్టు15కు విడుదల అవుతుందని మెగా అభిమానులు భావించారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈమూవీ విడుదల 2020 సంక్రాంతికి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇలా నిర్ణయం తీసుకోవడం వెనుక ఈమూవీ క్వాలిటీ విషయంలో ముఖ్యంగా ఈమూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు అన్న ఉద్దేశ్యం అని అంటున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో పాటు ‘సైరా’ ను బాలీవుడ్ అదేవిధంగా కోలీవుడ్ లో కూడ విడుదల చేయాలి అన్న ఉద్దేశ్యం వల్ల ఈమూవీ గ్రాఫిక్స్ ఆలస్యం అయినా క్వాలిటీ వచ్చే విధంగా రూపొందించాలి అన్న నిర్ణయం అని అంటున్నారు.

వాస్తవానికి ‘సైరా’ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరికి పూర్తి అయిపోతుంది. దీనితో ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇక ఉండవు కాబట్టి వచ్చే సమ్మర్ నుండి కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్ ల మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కించాలని చరణ్ ఆలోచన అని అంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ‘సైరా’ విడుదల అయిన తరువాత మాత్రమే తన తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

ఈవార్తలే నిజం అయితే దర్శకుడు కొరటాల శివ మరో సంవత్సరం ఆగవలసి ఉంటుంది కాబట్టి ఎత్తి పరిస్తుతులలోను వచ్చే ఏడాది సమ్మర్ నుండి కొరటాల శివ మూవీని ప్రారంభించుదామని అంటూ చరణ్ చిరంజీవి పై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. అయితే చిరంజీవి చరణ్ సూచనకు ఒప్పుకుంటాడా లేదంటే కొరటాల శివను మరొక ఏడాది వెయిటింగ్ లో పెడతారా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుందని ఫిలిం ఇండస్ట్రీలో గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: