ఈ మద్య యంగ్ డైరెక్టర్ అద్భుతమైన చిత్రాలు తీస్తూ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు.  ఆ మద్య రానా హీరోగా ‘ఘాజీ’చిత్రంతో భారత దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో సైతం తెరకెక్కించడంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది.  తాజాగా క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘అంతరిక్షం’. 
Image result for ‘అంతరిక్షం’
ఈ చిత్రం స్పేస్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.  తెలుగులో పూర్తి స్థాయి స్పేస్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో వరుణ్ తేజ్, అతిధి రావ్ హైదరీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో హీరోహీరోయిన్లు వ్యోమగాములు గానే కనిపించనుండటం విశేషం.  మరో ముఖ్య పాత్రలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘సమయమా’ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: