తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ ’బయోపిక్.  క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు.  ఈ చిత్రం రెండు భాగాలుగా అంటే ఎన్టీఆర్ సినీ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,రాజకీయ నేపథ్యంలో కొనసాగే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’చిత్రం తెరకెక్కబోతుంది.  ఈ చిత్రంలో సినీ నేపథ్యంలో వచ్చే కొన్ని ముఖ్య సన్నివేశాల కోసం ఏఎన్ ఆర్ గా సుమంత్, శ్రీదేవిగా రకూల్ ప్రత్ సింగ్, జయసుధ పాయల్ రాజ్ పూత్ ఇలా పలు సినీ తారలు తీసుకున్నారు.

ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు.  ఇక రాజకీయ నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో ఏపి సీఎం చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నాడు. తాజాగా  ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌య్య పోస్ట‌ర్  రిలీజ్ చేశారు చిత్రయూనిట్.   ఈ పోస్టర్ చూస్తుంటే ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ స్థాపించి ఎన్టీఆర్ ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తుంటే ఆయన వెంట వేలాది జనం కదిలి నడిచింది.  తాజాగా ఈ పోస్టర్ చూస్తుంటే బాలకృష్ణ అచ్చం తండ్రి హావ‌భావాలు కూడా దించేసినట్లు కనిపిస్తుంది. 

ఆవేశంగా న‌డిచి వ‌స్తుంటే ఆయ‌న్ని చూసి అంతా ఆహా ఓహో అనుకుంటున్నారు.ముఖ్యంగా పంచెక‌ట్టులో బాల‌య్య అదుర్స్ అనిపించాడు. అప్ప‌ట్లో నిజంగానే అన్న‌గారిని గుర్తు చేసాడు. ఒక‌ప్పుడు ఎన్టీఆర్‌ను చూడ‌ని వాళ్ల‌కు ఇప్పుడు బాల‌య్య‌ను చూస్తుంటే అలాగే ఉంటాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ సాంగ్ డిసెంబ‌ర్ 2 ఉద‌యం 7.42 నిమిషాల‌కు విడుద‌ల కానుంది.  జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది ఈ చిత్రం.    ఎన్టీఆర్ జీవితంలో ఏ విష‌యం కూడా మిస్ కాకుండా జాగ్ర‌త్త‌గా ఈ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నాడు క్రిష్.


మరింత సమాచారం తెలుసుకోండి: