తెలుగు ప్రేక్షకులకు తన అందాలతో విందు చేస్తానంటోంది. నిధి అగర్వాల్. సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్ ఇపుడు అక్కినేని చిన్నోడు అఖిల్ పక్కన కూడా నటిస్తోంది.  సవ్యసాచి ఆడకపోయినా నిధి గ్లామర్ కి మాత్రం బాగనే మార్కులు పడ్డాయి. ఆమెను అందలా నిధిగానే తెలుగు జనం భావిస్తున్నారు. ఇక ఆమె రెండవ మూవీ మజ్ఞూ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సవ్యసాచి మూవీలో నిధి బాగానె ఎక్స్‌పోజింగ్‌ చేసిందన్న కామెంట్స్ ఉన్నాయి. దీనిపైన నిధి ఇపుడు  బోల్డ్ గా జవాబు చెప్పింది.


అందంగా ఉండడమే కాదు, తాను గడుసైన భామని అని నిధి నిరూపించుకుంటోంది. తాను ఎక్కడా ఎక్స్‌పోజింగ్‌ చేయలేదని చెబుతూనే పాత్ర కొరితే అవసరమైతే ఎక్స్‌పోజింగ్‌ చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అంటోంది. తాను మడి కట్టుకుని కూర్చుంటానంటే ఎట్టా అని కూడా ఎదురు ప్రశ్నిస్తోంది. తాను ఉన్నది గ్లామర్ ఫీల్డులోనని, ఇక్కడ అలా మత్రమే ఉంటాను, చేస్తాను, అంటే కుదరదు కదా అంటోంది.


మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌కి నేను కూడా వ్యతిరేకమే, నేను అందంగా అందాన్ని మాత్రమే చూపుతాను,  అది కూడా పాత్ర కోరితేనే అని కండిషన్ కూడా పెడుతోంది. ఇక ఎక్స్‌పోజింగ్  విషయంలో మా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం ఇంతవరకూ రాలేదు అని నిధి చెపుకొచ్చింది. అంటే నిధి అందాల ఆరబోతకు యెస్ అంటూనే మితి మీరనని మరో వైపు చెబుతోంది. మరి ఈ అందాల నిధి గ్లామర్ తో ఎంత వరకు ఫిల్మ్ మేకర్స్ సినిమా పంట పండించుకుంటారన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: