అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందించిన ‘2.O’ మూవీకి మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ వచ్చినా ఆమూవీ కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో రావడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈమూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 70 కోట్లకు అమ్మడం జరిగింది. 
 ఇతర దర్శకులతో అయితే
కానీ వాస్తవానికి ఈమూవీకి మొదటిరోజున వచ్చిన నెట్ కలెక్షన్స్ చూస్తే ఈమూవీకి రావలసిన స్థాయిలో రాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తున్న ఈమూవీ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయడం అటుంచి అసలు ఈమూవీ బయ్యర్లు నష్టాల బాట పట్టకుండా బయటపడగలుగుతారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 
 సులభంగా పోల్చవచ్చు
ఈమూవీకి విమర్శకుల నుండి ప్రశంసలు లభించినా రజినీకాంత్ అభిమానులకు బాగా నచ్చినా ఈమూవీని 3డీ ఫార్మేట్ లో చూసిన వారికి మాత్రమే బాగా నచ్చుతుందని ఈమూవీని 2డీ ఫార్మేట్ లో చూసినవారికి ఈమూవీ పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమూవీని సౌండ్ సిస్టమ్ బాగా ఉంది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మింపబడ్డ ధియేటర్ల లో చూసినవారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ సాధారణ ధియేటర్ల లో చూసిన ప్రేక్షకులు ‘2.0’ తో పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడంతోనే ఈ మిశ్రమ స్పందన అని అంటున్నారు. 
 శంకర్ చిత్రాల్లో
దీనికితోడు ఇది సమ్మర్ సీజన్ అవ్వకపోవడంతో ‘2.0’ కు అనుకున్న స్థాయిలో కలక్షన్స్ రావడం లేదు అన్న వాదన కూడ ఉంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి తారా స్థాయికి చేరుకోవడంతో ప్రస్తుతం సాధారణ ప్రజల దృష్టి సినిమాల పై కన్నా ఎన్నికల పై ఉండటం కూడ ‘2.0’ కు శాపంగా మారింది అని అంటున్నారు. బాలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం ఈమూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా మొత్తం మీద 200 కోట్ల నష్టం వస్తుంది అని వస్తున్న కామెంట్స్ ఒక విధంగా రజినీకాంత్ ఇమేజ్ కి ఊహించని షాక్ అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: