ఒక సినిమా ఘోర పరాజయం ఒక టాప్ హీరోని ఎలా కన్ఫ్యూజ్ చేస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ అల్లు అర్జున్ అయోమయం అని అంటున్నారు. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు అంతా రాబోయే రెండేళ్ళ వరకు తన సినిమాలకు సంబంధించి కమిట్ అయిపోతే బన్నీ మటుకు తన చేయబోయే సినిమా కథను ఫైనల్ చేసుకోలేని అయోమయ స్థితి ఇండస్ట్రీలో చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

ప్రస్తుతం చరణ్ జూనియర్ లు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ లో బందీ అయిన నేపధ్యంలో మిగిలిన టాప్ హీరోలు మహేష్ ప్రభాస్ బన్నీల మధ్య మాత్రమే రాబోయే సంవత్సరంలో ప్రధానపోటీ నెలకొని ఉంది. మహేష్ ప్రభాస్ లు తమ సినిమాలను వేగంగా నడిపిస్తూ వచ్చే సంవత్సరం వార్ కు రెడీ అవుతున్నా అల్లు అర్జున్ నుండి తదుపరి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అతడికే తెలియని పరిస్థితి అని అంటున్నారు. 

బన్నీ త్రివిక్రమ్ ల కాంబినేషన్ సెట్ అయినా కథ మాత్రం సెట్ కావడం లేదు. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య అనేక సార్లు కథకు సంబంధించిన చర్చలు జరిగినా బన్నీ రకరకాల మార్పులు చేర్పులతో కూడిన సూచనలు చేస్తూ ఉండటంతో ఇప్పటికే త్రివిక్రమ్ కు చుక్కలు కనపడుతున్నాయి అన్న వార్తలు కూడ ఉన్నాయి. 

ఈ కథకు సంబంధించిన చర్చలు ఒకవైపు జరుగుతూ ఉండగానే అల్లు అర్జున్ మరో టర్న్ తీసుకుని తన ఇమేజ్ కు ఏమాత్రం సూట్ కాని తమిళ మూవీ 96 ను తన ఇమేజ్ కి అనుగుణంగా మార్చమని ఈమూవీ దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ ని అడిగాడు అని వార్తలు వస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ సినిమాను చేస్తూ బన్నీ ‘96’ రీమేక్ ను ఎక్కడ చేస్తాడు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో స్టైలిస్ట్ స్టార్ అయోమయం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: