చిరంజీవి లేకుంటే రాంచరణ్ వేస్టే, సినిమాలకు పనికిరాడు అంటూ వార్తలు సిని వర్గాల్లో తాజాగా వినిపిస్తున్నాయి. కారణం లేటెస్టుగా విడుదలయిన తూఫాన్, జంజీర్ రిజల్ట్ సరిగా లేకపోవడం. ఇప్పటి వరకు హిట్టయిన మగధీర, రచ్చ, ఇలా ఏ సినిమా అయినా చిరంజీవి సూచనల మేరకు కథలో మార్పులు, ఇంకా ఇతర విభాగాల్లో మార్పులు చోటుచేసుకుని తీసేవారట, అవి హిట్టయ్యాయి.

కాని కేంద్రమంత్రిగా బిజీ అయిన చిరంజీవి ఈ సినిమాలో ఎటువంటి జోక్యం చేసుకోలేదట. అన్ని రాంచరణ్ సొంత నిర్ణయాలు తీసుకుని సినిమాను తీసాడని ఏకంగా డైరెక్టర్ అపూర్వ లఖియా కూడా వాఖ్యానించడం గమనార్హం. చివరకు డ్రెస్ కోడ్ విషయంలో కూడా చెర్రీ తీసుకున్న నిర్ణయం సినిమాకు మైనస్ అయ్యిందంటున్నారు. అంటే చిరంజీవి సహకారం లేకుండా రాంచరణ్ సినిమాల్లో రాణించలేడని జంజీర్, తూఫాన్ లు రుజువు చేసాయన్న మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: