మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ విడుదల విషయంలో వచ్చిన మార్పులు చిరంజీవి కొరటాలల మూవీ ప్రాజెక్ట్ పై ప్రభావాన్ని చూపెడుతుందా అన్న సందేహాలకు ఒక క్లారిటీ వస్తోంది. ‘సైరా’ విడుదల 2020 సంక్రాంతికి  వాయిదా పడటంతో అప్పటివరకు కొరటాల చిరంజీవి గురించి వెయిట్ చేయవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పడు ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు మళ్ళీ మహేష్ వైపు యూటర్న్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘మహర్షి’ మూవీ షూటింగ్ ఫిబ్రవరితో పూర్తి అవుతుంది. వెంటనే సుకుమార్ తో మహేష్ ఒక సినిమా చేయడానికి కమిట్ మెంట్ ఉన్నప్పటికీ కథ విషయంలో క్లారిటీ రాలేదు కాబట్టి ఈమూవీ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే అవకాసం ఉంది అని అంటున్నారు. 

దీనితో సుకుమార్ గురించి మహేష్ రెడీ అయ్యేలోపు కొరటాల మూడవసారి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో మహేష్ తో సినిమాను తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కొరటాలకు రావడం దానికి మహేష్ ఓకె చెప్పడం జరిగిపోయింది అని అంటున్నారు. ఇప్పటికే సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు గాంచిన వీరిద్దరి కలయిక పై మహేష్ కు కూడ పూర్తి నమ్మకం ఉండటంతో మరొకసారి వీరిద్దరి కాంబినేషన్ ఫైనల్ అయినట్లు టాక్. 

దీనితో చిరంజీవి కోసం ఇప్పటికే కొరటాల రెడీ చేసిన స్క్రిప్ట్ ను మహేష్ వైపు మళ్ళిస్తాడా లేదంటే మహేష్ కు మరొక కథ ఆలోచిస్తాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘సైరా’ కు సంబంధించి గ్రాఫిక్స్ పనుల ఆలస్యం మాత్రమే కాకుండా ఈమూవీకి కొన్ని రీషూట్స్ కూడ తప్పని పరిస్థుతులలో ఇలా కొరటాల మహేష్ వైపు తిరిగి చూసి ఉంటాడు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: