ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు అత్యంత  భారీస్థాయిలోఉంటున్న నేపధ్యంలో ప్రస్తుత తరం టాప్ హీరోలు తమకి వస్తున్న భారీ పరితోషికాలకు సంబంధిం చిన డబ్బును వివిధ రకాల వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.  కొంతమంది హీరోలు పెద్దపెద్ద బిజినెస్ లు చేస్తూ ఉంటే మరికొందరు హీరోలు మాత్రం బిజినెస్ ల జోలికి వెళ్ళకుండా రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో టాప్ హీరోలలో ముందు వరసలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తనకు సంబంధించిన చడబ్బును రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తాడని టాక్ ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఎన్టీఆర్ స్పెయిన్ దేశంలో ఒక విల్లా కొన్నాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడ్ చేస్తున్నాయి. అయితే జూనియర్ ఇలా మనదేశంలో కాకుండా స్పెయిన్ దేశంలో ఆస్తులు కొనడం వెనుక ఒక సీక్రెట్ ఉంది అని అంటున్నారు. 

ప్రస్తుతం మన తెలుగు సినిమాలు చాలా యూరప్ లో ముఖ్యంగా స్పెయిన్ షూటింగ్ జరుపుకోవడం కామన్ అయిపోయింది. దీనితో తమ సినిమాల షూటింగ్ కోసం స్పెయిన్ వెళుతున్న చాలామంది సినిమాల యూనిట్ సభ్యులకు స్పెయిన్ లో ఎకామిడేషన్ సమస్యలు ఏర్పడుతున్నట్లు సమాచారం. దీనితో స్పెయిన్ లో షూటింగ్ కోసం వెళుతున్న చాలమంది నిర్మాతల ఎకామిడేషన్ సమస్యలు తీర్చే నిమ్మితం ఈ భారీ విల్లాను జూనియర్ కొన్నట్లు సమాచారం. 

ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో కొన్న ఈభారీ విల్లా వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు స్పెయిన్ దేశంలో విదేశీయులు ప్రాపర్టీస్ కొనుగులో చేయడంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేని సందర్భం కూడ జూనియర్ కు బాగా కలిసి వచ్చినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ విల్లాను జూనియర్ 3.5 మిలియన్ డాలర్లకు కొన్నట్లు టాక్. అయితే ఈ విల్లాను జూనియర్ తాను ఒక్కడే కాకుండా తన అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి కొన్నట్లు వస్తున్న ఈవార్తలు మరొకసారి ఈ అన్నదమ్ముల అనుబంధాన్ని సూచిస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: