రోబో 2.0 సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో దూసుకు పోతుంది .అయితే సినిమా లో గ్రాఫిక్స్ చాలా బాగుందని అందరూ శంకర్ ను మెచ్చుకుంటున్నారు. అయితే శంకర్‌కి వీరాభిమాని అయిన రాజమౌళి 2.0 రిలీజ్‌కి ముందు చాలానే హడావిడి చేసాడు. ఈ చిత్రం ప్రమోషన్‌ ఈవెంట్‌లో రాజమౌళికి తాను అభిమానిని అని శంకర్‌ చెప్పుకున్నాడు. విడుదలకి ముందు రోజు చాలా ఎక్సయిటెడ్‌గా వున్నానని చెప్పిన రాజమౌళి సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్నా ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు. 

Image result for rajamouli

ఎంత బిజీలో వున్నా కానీ, ఎంత పెద్ద సినిమా వచ్చినా తప్పకుండా తొలి రోజు చూసేసే అలవాటు వున్న రాజమౌళి ఈ చిత్రాన్ని ఇంకా చూడలేదంటారా? ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌తో రాజమౌళి ప్రస్తుతం బిజీగా వున్నాడు. ఇద్దరు స్టార్‌ హీరోలు డేట్స్‌ ఇచ్చారు కనుక ప్రతి కాల్షీట్‌ని కేర్‌ఫుల్‌గా వాడుకోవాలి. ఈ కారణంగానే ఇంకా రాజమౌళి 2.0 చూడలేదేమో. ఆదివారం షూటింగ్‌కి సెలవు వుంటుంది కనుక అదే రోజు రాజమౌళితో పాటు ఇద్దరు హీరోలు కూడా సినిమా చూసే అవకాశముంది. 

Image result for robo 2.0 shankar

2.0పై రాజమౌళి లాంటి మేథావి స్పందన ఏమిటో తెలుసుకోవాలని తమిళ సినీ ప్రియులు, శంకర్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరు గొప్ప అనే టాపిక్‌ సినిమా అభిమానుల్లో చాలా కాలంగా నలుగుతోంది. అందుకే ఒకరి సినిమాలపై ఒకరి స్పందనకి ఎప్పుడూ అంత వేల్యూ వుంటుంది. అయితే చూడాలి జక్కన్న రోబో కు ఎటువంటి రివ్యూ ఇస్తాడో...!

మరింత సమాచారం తెలుసుకోండి: