రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మూవీస్ లో ఒకటిగా ఉన్న ‘ఎన్టీఆర్’ బయోపిక్లో మొదటి సాంగ్ ని ని కొద్ది సేపటి క్రితం విడుదల చేసారు. ‘ఘ‌న‌ కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా’.. అంటూ  సాగిన ఈ పాట వినడంతోనే గగుర్పాటు కలిగించేలా తెలుగు వారి
ఖ్యాతిని ఇనుమడింపచేసేలా ఉండడం విశేషం. ఈ పాట అన్న గారి సినిమా రేంజికి పెంచేసేలా ఉందని అంటున్నారు. పాటకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీపై ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి. 


మ్యూజిక్ లెజెండ్ ఎమ్ ఎమ్ కీరవాణి అద్భుతమైన స్వరాలను సమకూర్చగా.. ఆయన తండ్రి శివ శక్తి దత్తా ముత్యాల్లాంటి తెలుగు అమరికలతో సాహిత్యం అందించారు. ఈ పాటలోని ప్రతి పదం అన్నగారి ఔన్నత్యాన్ని చాటి చెప్పేదిగా ఉంది. విలక్షణ గొంతుతో సింగర్ కైలాష్ ఖేర్ ఈ పాటకు ప్రాణం పోశారు. కాగా ఈ చిత్ర తొలి భాగం ‘క‌థానాయ‌కుడు’ పేరుతో జ‌న‌వరి 9న విడుద‌ల కానుండ‌గా, రెండో భాగం ‘మ‌హానాయ‌కుడు’ పేరుతో జ‌న‌వ‌రి 24న విడుదల కానుంది.


‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రంపై రోజు రోజుకూ అంచనాలు పెంచేస్తుంది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ సినీ అభిమానుల దృష్టిని బయోపిక్ వైపుకి తిప్పిన క్రిష్ అంధనాలను పెంచడంలో మాత్రం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ సాంగ్ విన్న తరువాత ఎవరికి వారు విజువలైజేషన్ చెసుకుంటారు. దాంతో ఈ మూవీపై మరింతగా ఇంటెరెస్ట్ పెరుగుతోంది. ఈ మూవీకి క్రిష్ డైరెక్టర్ కావడం ఎంతగా ప్లస్ అయిందన్నది ఆయన ప్రచార శైలి, పాత్రల ఎంపిక, సినిమాపై కనబరుస్తున్న పూర్తి శ్రద్ధను బట్టి చెప్పేయవచ్చు. మరో 47 రోజుల్లో సినిమా ధియేటర్లలో అన్న గారి బొమ్మ వచ్చేస్తోందన్నఉత్కంఠ ఇపుడు అందరిలోనూ కనిపిస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: