సూపర్ స్టార్ రజిని, శంకర్ కాంబోలో రోబో సీక్వల్ గా వచ్చిన క్రేజీ మూవీ 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 600 కోట్ల భారీ నడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 29న గ్రాండ్ గా రిలీజైంది. రజినితో పాటుగా సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా ప్రతినాయకుడిగా నటించాడు.


ప్రపంచవ్యాప్తంగా 6800 థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రికార్డ్ కలక్షన్స్ వసూళు చేస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా రజినికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్, చైనా, మలేషియా, అమెరికాలో రజిని క్రేజ్ అందరికి తెలిసిందే. పాకిస్తాన్ లో కూడా 2.ఓ గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు. 


కాని అక్కడ సినిమాను కేవలం 15 నుండి 20 సెంటర్స్ లో మాత్రమే రిలీజ్ కు అనుమతి ఇచ్చారు. సినిమాకు వచ్చిన టాక్ బాగుండటంతో ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా 75 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారట. అక్కడ వసూళ్లు కూడా బాగానే ఉన్నాయని తెలుస్తుంది. రజిని మేనియా పాకిస్తాన్ లో కూడా కొనసాగుతుంది.


ఇక చెన్నైలో రజిని మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. 2.ఓ మొదటి రోజు 2.67 కోట్లతో చెన్నై టౌన్ రికార్డ్ సాధించాడు రజినికాంత్. ఇప్పటిదాకా విజయ్ సర్కార్ సినిమా మీద ఉన్న ఈ రికార్డ్ కాస్త రజిని బ్రేక్ చేశాడు. సర్కార్ సినిమా చెన్నైలో 2.35 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక 2.ఓ ఇప్పటివరకు తెలుగు రెండు రాష్ట్రాల్లో 25 కోట్లు రాబట్టగా ఓవరాల్ గా 200 కోట్ల గ్రాస్ రీచ్ అయ్యిందని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: