టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలో దిగడం ఒక సంచలనం అయితే ఆ వ్యాపారంలో మహేష్ 80 కోట్లు పెట్టిన పెట్టుబడి ఇండస్ట్రీ షాకింగ్ న్యూస్ గా మారింది. ‘ఎఎంబి సినిమా' పేరుతో నిర్మించిన మెగా మల్టీప్లెక్స్ ఆదివారం సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఎఎంబి అంటే 'ఏషియన్ మహేష్ బాబు' అని అర్థం. ఏసియన్ సినిమాస్‌ సంస్థతో కలిసి మహేష్ బాబు దీన్ని నిర్మించాదు. 
ప్రత్యేకతలు ఏమిటి?
కేవలం ఇది ఒక మెగా మల్టీ ప్లెక్స్ మాత్రమే కాకుండా అత్యంత విలాస వంతమైన లగ్జరీ కాంప్లెక్స్ గా ప్రేక్షకులు వరల్డ్ క్లాస్ థియేటర్ ఎక్స్‌ పీరియన్స్ పొందేలా తీర్చి దిద్దిన ఈ కాంప్లెక్స్ ను చూసిన వారు అంతా ఆశ్చర్య పోయారు. మొత్తం 7 థియేటర్లు 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ భాగ్యనగరానికే ఒక సరికొత్త అందాన్ని తీసుకు వచ్చింది. 
 ఎన్ని థియేటర్లు? సీట్ల సామార్థం ఎంత?
ఈ కాంప్లెక్స్ లో మూవీ చూడాలి అంటే 200 టిక్కెట్ ధరగా నిశ్చయించారు. ప్లాటినమ్ కేటగిరీలో ఉన్న పరిమిత సంఖ్యలో కొన్ని సీట్లు మరింత సౌకర్యవంతంగా ఉన్నాయి. ఈమూవీ ధియేటర్స్ లోని  స్క్రీన్‌తో పాటు సౌండ్ క్వాలిటీ ప్రపంచ స్థాయిలో కనిపించింది.  ముఖ్యంగా అద్భుతమైన ఇంటీరియ్ డిజైనింగ్ సూపర్ లుక్‌ ఈ ‘ఎఎంబి సినిమాస్' ప్రత్యేకత. 
 అందరి చూపు ఇటు వైపే
ఈ మల్టీ ప్లెక్స్ కు సంబంధించిన ఇంటీరియర్ వర్క్ ను మహేష్ బాబు భార్య నమ్రత స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం. అంతేకాదు ఇలాంటి మరో భారీ ధియేటర్స్ కాంప్లెక్స్ ను మహేష్ హైదరాబాద్ లో మరొకటి నిర్మించబోతున్నాడు అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: