వచ్చేనెల సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఎవరికీ ఇప్పటి వరకు తెలియని చాల పాత్రలు పరిచయం కాబోతున్నాయి. ఎన్టీఆర్ సినిమా రాజకీయ జీవితానికి సంబంధించి అందరికీ తెలిసినవి కొన్ని పేర్లు మాత్రమే అయితే తెలియని చాలామంది పాత్రల పరిచయం ఈమూవీ ద్వారా ప్రేక్షకులకు చేసి క్రిష్ షాక్ ఇవ్వబోతున్నాడు. 
ఎవరీ రుక్మనంద రావు?
తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ లో కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీలో వెన్నెల కిషోర్ పాత్ర ఎవరు ఊహించని ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సోదరుడు రుక్మనందరావు పాత్రలో కనిపించబోతున్నాడు. 

కీలక పాత్రల్లో...

ఎన్టీఆర్ సినిమా హీరోగా తన కెరియర్ మొదలు పెట్టినప్పుడు ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకునే మొట్టమొదటి మేనేజర్ ఈ రుక్మనందరావు. ఎన్టీఆర్ ఫిలిం కెరియర్ తొలి నాళ్ళల్లో ఆయన కెరియర్ స్థిరపడటానికి ఈ రుక్మనందరావు చాల విశేషకృషి చేసినట్లు సమాచారం. 

రెండు భాగాలు
అయితే కామిడీ పాత్రలకు చిరునామాగా ఉండే వెన్నెల కిషోర్ ఈమూవీలో చాల సీరియస్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న ఈమూవీ ఆడియో ఫంక్షన్ ను ఈనెల మధ్యలో డిసెంబర్ లో అత్యంత ఘనంగా తిరుపతిలో చేయబోతున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా పాల్గొనే విధంగా డిజైన్ చేయబడుతున్న ఈమూవీ ఆడియో ఫంక్షన్ కనీ వినీ ఎరుగని స్థాయిలో బాలకృష్ణ నిర్వహించబోతున్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: