నాచురల్ స్టార్ నాని సూపర్ స్టార్ రజినికాంత్ మీద ఉన్న అభిమానంతో చేసిన ఓ పొరపాటు తెలుగు ఆడియెన్స్ ను హర్ట్ చేస్తుంది. నవంబర్ 29న రిలీజైన 2.ఓ సినిమా మంచి టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మూడు రోజుల్లో 170 కోట్ల గ్రాస్ తో రజినికి ఈ మూవీ మంచి విజయాన్ని అందించింది.


ఇక ఈ సినిమా చూసిన నాని శంకర్ మ్యాజిక్ తో తాను మరోసారి చిన్న పిల్లాడిలా మారిపోయానని.. ఇక బాక్సాఫీస్ కు దిగిపోద్దని ట్వీట్ చేశాడు నాని. అంతేకాదు 300 సినిమాలో శత్రువుల మూకని తన్నితే బావిలో పడే జిఫ్ ఫైల్ ను యాడ్ చేశాడు. 2.ఓ బాక్సాఫీస్ కు దిగిపోవడం ఓకే కాని ఆ జిఫ్ ఫైల్ తెలుగు సినిమా అభిమానులకు నచ్చలేదు.


ఈ విషయంపై నాని మీద నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్లు. రజినికాంత్ అంటే నానికి ఎంతో ఇష్టం ఆ అభిమానంతో నాని చేసిన ఈ చిన్న కామెంట్ వల్ల తెలుగు ఆడియెన్స్ భగ్గుమంటున్నారు. బాహుబలిని బీట్ చేయలేని 2.ఓ ఎలా బాక్సాఫీస్ కు దిగిపోద్దని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి 2.ఓ పై తన అభిప్రాయంతో నాని మరోసారి ఆడియెన్స్ ట్రోల్స్ కు బలయ్యాడు.


ఇక సినిమాల విషయానికొస్తే.. నాని ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. నాని సరసన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. జెర్సీ తర్వాత నాని విక్రం కుమార్ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: