‘శ్రీనివాస కళ్యాణం’ ఘోరమైన ఫ్లాప్ తో నితిన్ పరిస్థితి మరింత అయోమయంగా మారిపోయింది. వరస పరాజయాలు నితిన్ కు అయోమయాన్ని సృష్టిస్తున్న నేపధ్యంలో ఈ యంగ్ హీరో కెరియర్ ప్రస్తుతానికి ప్రశ్నార్ధకంగా మారింది. ఇలాంటి పరిస్థుతులలో ఇటీవల జరిగిన ఒక ఫిలిం సెలెబ్రెటీల పార్టీలో నితిన్ చేతికి కట్టుతో కనిపించడంతో నితిన్ కు ఏమైంది అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. 
గుర్తుండి పోయే సెల్ఫీ
హీరోయిన్ రాశి ఖన్నా తన పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెల్రబిటీలను ఆహ్వానించి పార్టీ చేసుకుంది. నవంబర్ 30న జరిగిన ఈ పార్టీకి టాలీవుడ్ కు చెందిన అనేకమంది యంగ్ హీరోలు హాజరయ్యారు.  సాయి ధరమ్ తేజ్, నితిన్, రామ్, రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి, అల్లు శిరీష్, సత్యం రాజేష్, అవసరాల శ్రీనివాస్ ఇలా చాలమంది వచ్చిన ఈపార్టీ వేడుకలలో నితిన్ కూడ హాజరయ్యాడు.  
మంచు లక్ష్మి, రకుల్, ధరమ్ తేజ్, రామ్
‘90' స్ థీమ్‌తో ఈ బర్త్ డే పార్టీని విభిన్నంగా నిర్వహించారు. విందు వినోదాలతో పాటు ఈపార్టీ అత్యంత ఘనంగా జరిగినట్లు టాక్. ముఖ్యంగా ఈపార్టీలో నటుడు సత్యం రాజాశ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు అని వార్తలు వస్తున్నాయి. రాశీ ఖన్నా నటించిన అనేక సినిమాలలో సత్యం రాజాశ్ ఆమెతో కలిసి నటించడంతో రాశీ తో రాజాశ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. 
సత్యం రాజేష్
ప్రస్తుతం ఈపార్తీకి సంబంధించిన ఫోటోలు మీడియాలో హడావిడి చేస్తున్నాయి. రాశి ఖన్నా తో కలిపి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్స్ చాలామంది ఇప్పటికే టాప్ హీరోయిన్స్ గా మారిపోయినా ఇంకా రాశి ఆ స్థాయికి ఎదగలేక పోయింది. టాప్ యంగ్ హీరోలతో ఈమెకు కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చినా అవన్నీ ఫెయిల్ అవ్వడంతో ఈమెకు ఐరన్ లెగ్ బ్యూటీ అన్న ట్యాగ్ పడిపోయింది. మరి కొత్త సంవత్సరంలో అయినా ఈమెకు కాలం కలిసి వస్తుందేమో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: